కాళేశ్వరం టూర్ కు ఉపాద్యాయులపై ‘నిషేధం’!!.

కాళేశ్వరం టూర్ కు ఉపాద్యాయులపై ‘నిషేధం’!!.
DTF నాయకుల అరెస్టు!

Manchiryala:

కాళేశ్వరం పర్యటనకు వెళుతున్న డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డి టి ఎఫ్) రాష్ట్ర నాయకత్వం , వివిధ జిల్లాల నాయకులు 60 మందిని మంచిర్యాల జిల్లా పోలీసులు అరెస్టు చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యుటిఎఫ్) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. “రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా రంగం బలోపేతానికి కృషి చేస్తూ, సమాజాభివృద్ధికి తోడ్పడే ఆలోచనతో ఉపాధ్యాయులు వేసవి సెలవుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ రిజర్వాయర్ ప్రాంతాలు చూడటానికి వెళుతుంటే పోలీసులు అరెస్టు చేయడం అప్రజాస్వొమికం. ఉపాధ్యాయులను అరెస్ట్ చేయటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎంత అభద్రతా భావంలో ఉందో అర్థమవుతూనే ఉంది. రాష్ట్రలోని విద్యా రంగంలో ఉన్న అనేక సమస్యల్ని పరిష్కరించకపోగా ఇలా సంఘాల నాయకులను అరెస్టు చేయడం సమంజసం కాద”ని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ రాములు, చావ రవి పేర్కొన్నారు.
“ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం..వారిని బేషరతుగా వెంటనే విడుదల చేయాల”ని టీఎస్ యుటిఎఫ్ డిమాండ్ చేస్తున్నది .