కాళేశ్వరం పనుల పరిశీలన.

కరీంనగర్:
కాళేశ్వరం ప్యాకేజీ 8 నుంచి కాలువ వరకు బయలుదేరే గ్రావిటీ కాలువ లైనింగ్ పనులను మంత్రి హరీశ్ గురువారం పరిశీలించారు.వర్షాల కారణాన లైనింగ్ పనులు ఆగినాయని ఇంజనీర్లు చెప్పారు. కాలువలో వీటిని తోడి పనులు చేస్తున్నామని చెప్పారు.కాలువ పై స్త్రక్చర్లు ఈ నెలాఖరుకు పూర్తి అవుతాయని అన్నారు. వరద కాలువలో కలిసే ముందు ఉన్న రెగ్యులేటర్ గేట్ల బిగింపు పనులు ఆగస్టులో పూర్తి చేస్తామని చెప్పారు.పనులు మరింత వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించినారు.