కాళేశ్వరం పై పిటిషన్ తిరస్కరణ.

ఢిల్లీ:
కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన పిటీషన్ ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు ను అవసరానికి మించి నీటి నిల్వ సామర్థ్యంతో కడుతున్నారని పిటిషన్ దాఖలైంది.
తెలంగాణ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ వాదించారు. వాదనలు విన్న జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తా. తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలకు సంబంధించిన విషయం కాబట్టి మహారాష్ట్ర ఏదయినా అభ్యంతరం చెప్తే అప్పుడు సుప్రీంకోర్టు కు రావాలన్న ధర్మాసనం. రాష్ట్ర హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్ కు సూచన. ఇది అంతరాష్ట్ర వివాదం అన్న పిటీషనర్ వాదనను సుప్రీంకోర్టు అంగీకరించలేదు. హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఒకవేళ హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేస్తే అప్పుడు తమ దగ్గరకి రావాలని సుప్రీంకోర్టు తెలిపింది.