కూల్ డ్రింక్ లో మత్తుమందు. లైంగిక దాడి. ఆలస్యంగా వెలుగులోకి ఘటన.

విజయవాడ;
‘బర్త్‌ డే’ పేరుతో ఓ విద్యార్థినిని పార్టీకి పిలిచి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇద్దరు విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన 2017లో జరిగింది. అంతటితో ఆగకుండా ఈ దారుణాన్ని వీడియో చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడ్డారు. కృష్ణాజిల్లా ఆగిరిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో సంఘటన జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఎవరికైనా చెబితే చంపేస్తామనడంతో భయపడిన విద్యార్థిని తనపై జరిగిన లైంగిక దాడి గురించి ఆమె బయటకు చెప్పలేదు. చివరికి వీడియో వైరల్ కావడంతో బాధితురాలు తల్లిదండ్రులకు జరిగినదంతా చెప్పింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు కళాశాల కరస్పాండెంట్‌కు ఫిర్యాదు చేశారు. తాజాగా ఆ వీడియోను నిందితులు శివారెడ్డి, కృష్ణారెడ్డి తమ స్నేహితుడైన ప్రవీణ్‌‌కు పంపించారు. 10లక్షలు ఇవ్వాలంటూ ప్రవీణ్ బాధితురాలిని బెదిరించాడు . బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు శివారెడ్డి, కృష్ణారెడ్డి, ప్రవీణ్‌పై కేసు నమోదు చేశారు.