కృష్ణా నదిలో నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి

విజయవాడ:
విజయవాడలో కృష్ణా నది పవిత్ర సంగమం వద్ద స్నానానికి వెళ్లి నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృత్యువాత పడ్డారు. విద్యార్థులు గల్లంతయ్యారన్న సమాచారాన్ని తెలియగానే రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. గల్లంతయిన విద్యార్థుల మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికి తీశారు. మృతులు చైతన్య, శ్రీనాథ్, ప్రవీణ్, రాజ్‌కుమార్‌గా గుర్తించారు. మొదట నదిలో మూడు మృత దేహాలే లభ్యమయ్యాయి. కాసేపటి తర్వాత మరో మృత దేహం కనిపించింది