కేటిఆర్ కు మరో కష్టం. విచారణకు ఆదేశం.

రాజన్నసిరిసిల్ల;
ముఖ్యమంత్రి కెసిఆర్ కుమారుడు కేటిఆర్ కు మరో కష్టం వచ్చింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇదివరకే కొన్ని ఘటనలు ఆయనను ఇబ్బంది పెట్టాయి.తాజాగా అధికార పార్టీ కౌన్సిలర్ ‘భూబాగోతం’ మంత్రిని ఇరకాటంలోకి నెట్టింది.సిరిసిల్ల నియోజకవర్గంలో అధికారపార్టీకి చెందినకౌన్సిలర్కనకయ్యభూకబ్జాలకుపాల్పడుతున్నడంటూ వచ్చిన వార్తలపై విచారణ జరపాలని మంత్రి కేటిఆర్ఆదేశించారు.తన అనుచరగణంతో కలిసి పేదలకు చెందిన ఖాళీ స్థలాలను కబ్జాలు చేస్తున్న కౌన్సిలర్  నకిలీ పట్టాలుసృష్టిస్తున్నాడు. ఏకంగా ఆ జాగాల్లో ఇళ్లే  నిర్మిస్తూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిగాక్రయవిక్రయాలుచేసేస్తున్నాడు. అయితే అదంతా అక్రమ దందా అయినా మంత్రికిగానీ, ఇంకెవ్వరికీగానీపట్టడంలేదా అనే విమర్శలు వస్తున్నవి.రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ నేతల ఆగడాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. కార్మిక క్షేత్రమైన బీ.వై. నగర్లో మంగళారపు సువర్ణ అనే మహిళకు చెందిన ఖాళీ స్థలాన్ని స్థానిక టీఆర్ఎస్ కౌన్సిలర్, సిరిసిల్లా మున్సిపల్ వైస్ చైర్మెనైనతవుటు కనకయ్య కబ్జాచేశాడన్నది సువర్ణ ఆరోపణ. కొంత కాలం క్రితం సువర్ణకు తల్లి నుండి సంక్రమించిన స్థలంలో పూరిగుడిసె వేసుకుని భర్త, కొడుకుతో బీడీలు చుట్టుకుంటూ బతుకుతుండేది. అనుకోకుండా భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. కొడుకు కూడా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కొడుకును బ్రతికించుకోవడానికి ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. గత వర్షాకాలంలో ఉన్న పూరిగుడిసె కూడా కూలిపోయింది.పట్టణశివారులో ఓ చిన్న గదిని కిరాయికి తీసుకుని బతుకీడుస్తోంది. నాఅన్నవారు ఎవరూ లేకపోవడం తో ఖాళీగా ఉన్న సువర్ణ స్థలంపై అధికారపార్టీ కబ్జాదారుల కన్నుపడింది. మంత్రితో పాటు అధికారుల అండదండలున్నాయని చెప్పుకునే మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌  కనకయ్య కబ్జా బాగోతం సాగించాడు. ఖాళీస్థలంలో తన అనుచరుల పేరుతో దొంగ పత్రాలు సృష్టించాడు.తనకున్న అధికారబలంతో ఓ నిరుపేద మహిళను రోడ్డునపడేశాడు.సువర్ణమ్మసోమవారం  తన స్థలంలోకి వెళ్ళింది. కౌన్సిలర్‌కు సంబంధించిన ఓ అనుచరుడు తనను రాకుండా అడ్డుకుని ఆ జాగా తమదేనంటూ  దొంగ పత్రాలు చూపెట్టాడన్నది బాధిత మహిళ అభియోగం. కౌన్సిలర్ దగ్గరకు వెళితే నీ దిక్కున్నచోటచెప్పుకపోఅంటూ బయటకు వెళ్లగొట్టాడని ఆమె కన్నీటి పర్యంతమైంది. ప్రజలకు సేవ చేయాల్సిన కౌన్సిలర్లే ఖాళీ స్థలాలు కనబడితే ఈ విధంగా కబ్జాలకు పాల్పడడంతో కార్మికక్షేత్రంలో సామాన్య, మధ్యతరగతి జనం భయాందోళనకు గురవుతున్నారు. మంత్రి కేటిఆర్ తో పాటు, కలెక్టర్, ఆర్డిఓ, ఎంఆర్ఓ, మున్సిపల్ కమీషనర్లకు ఎన్ని సార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడంలేదని,తనకు న్యాయం జరగకపోతే కలెక్డరేట్ ముందే అత్మహత్య చేసుకుంటానని సువర్ణ ఆవేదన వ్యక్తం చేసింది.