కేటీఆర్ కు చెబితే కేసీఆర్ కు చెప్పినట్లే. – మంత్రి తలసాని.

హైదరాబాద్:
ఏ విషయమైనా కేటీఆర్ కు చెబితే సీఎం కు చెప్పినట్లే నని మంత్రి తలసాని అన్నారు. కేటీఆర్ పట్ల విధేయతను తలసాని బహిరంగంగానే ప్రదర్శిస్తున్నారు.”ఈమధ్య కొంత మంది కొత్త బిక్షగాల్లు యాత్రల పేరుతో ప్రజలను కలుస్తున్నారు” అని తలసాని బీజేపీ, కాంగ్రెస్ లపై దుమ్మెత్తి పోశారు.
60 ఏళ్ల లో వాళ్ళు పాలించినట్లు మనం పాలించాలని కోరుకుంటున్నారని అన్నారు. మా ప్రభుత్వం ఖచ్చితంగా ఆర్య వైశ్యులకు న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు.
ఆర్య వైశ్యులకు ప్రజలతో నేరుగా సంభందాలు వుంటాయని, మీరంతా టీఆర్ఎస్ లో చేరటం మంచి పరిణామం అని నాయిని చెప్పారు. మీరు మా వెంట వుండండి.. కాంగ్రెస్ వాడిని అడ్రెస్స్ లేకుండా చేద్దాం అని హోం మంత్రి పిలుపునిచ్చారు. మోడీ గ్రాఫ్ పడిపోయిందన్నారు.
తెలంగాణ గడికి గండి పెట్టుడు కాదు, ఢిల్లీలో బిజేపి గడీ కి గండి పెడుతున్నారని తెలిపారు.