కేటీఆర్ కు విహెచ్ వార్నింగ్. సోనియా పై మరోసారి నోరు జారితే ఖబడ్దార్.

హైదరాబాద్:
సోనియా గాంధీ పై మరోసారి నోరుజారితే నేరుగా సి.ఎం.ఇంటికొస్తానని, తాడోపేడో తేల్చుకుంటా నని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హెచ్ హెచ్చరించారు. పోలీసులు ఉన్నారనుకుంటున్నావేమో నీ సంగతి చూస్తా అని అన్నారు. కేటీఆర్ నీ వెంత నీ స్థాయి ఎంత ..? అని వి.హెచ్. మండిపడ్డారు.
కొడుకుని అదుపులో పెట్టుకో కేసీఆర్ అని అన్నారు. కెసిఆర్.. మీకు ఇదే లాస్ట్ వార్నింగ్ అని కూడా వి.హెచ్. అన్నారు. కాంగ్రెస్ నేతలు లఫంగలు అయితే.. కాంగ్రెస్ లో పుట్టిన కేసీఆర్ కూడా లఫంగే అని వి.హెచ్. విమర్శించారు.
సోనియా తెలంగాణ ను ఇవ్వకపోతే.. కేసీఆర్ దుకాణం ఎక్కడుండేదని ఆయన శనివారం విలేకరులతో అన్నారు.