కేసీఆర్ పర్యటన ఏర్పాట్లు.

గద్వాల:
జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ నెల 29న సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో బహిరంగ సభ స్థలాన్ని మంత్రులు హరీష్ రావు, డాక్టర్ సి లక్ష్మారెడ్డి పరిశీలించారు. గద్వాల లో కొండపల్లి రోడ్ లో సంబరాల గ్రౌండ్ లో బహిరంగ సభకు స్థలాన్ని మంత్రులు పరిశీలించారు. గట్టు మండలం పెంచికల పాడు దగ్గర పైలాన్ నిర్మాణం పనులను పరిశీలించారు. అనంతరం తుమ్మిళ్ల ప్రాజెక్ట్ పనులను మంత్రులు పరిశీలించారు.
మంత్రులతో పాటు మహబూబ్ నగర్ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఢిల్లీలో రాష్ట్ర ప్రతినిధి మంద జగన్నాథం, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, టీఆరెస్ గద్వాల ఇంచార్జి కృష్ణమోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.