కేసీఆర్ పర్యటన. కాంగ్రెస్ ఎమ్మెల్యే గృహ నిర్బంధం.

మహబూబ్ నగర్:
ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో శాంతినగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పోలీసులు భారీగా మోహరించారు. ఏ.ఐ.సి సి.కార్యదర్శి, ఆలంపూర్ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశత్వానికి ఇది పరాకాష్ట అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ అన్నారు.
పూర్వ పాలమూరు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఉందని ఒక దళిత శాసన సభ్యుడిని గృహ నిర్బంధం చేయడం దారుణం, ప్రభుత్వానికి ఇది తగదన్నారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం సంపత్ ఎమ్యెల్యే గా పోరాడి సాధించారని తెలిపారు. గట్టు ఎత్తిపోతల పథకానికి గత కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసినా టిఆర్ఎస్ ప్రభుత్వం పనులు చేయలేదని చెప్పారు.
దళిత శాసన సభ్యుడైన సంపత్ ను ప్రభుత్వం కుట్ర పూరితంగా శాసన సభ్యత్వాన్ని రద్దు చేసింది. హై కోర్ట్ రెండు సార్లూ ఆదేశించినా కూడా కేసీఆర్ పట్టించుకోకుండా కోర్ట్ ఆదేశాలను సైతం దిక్కరించారని ఉత్తమ్ విమర్శించారు. ఇప్పుడు అకారణంగా గృహ నిర్బంధం చేసి నిరంకుశత్వాన్ని చాటుకున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచిదికాదన్నారు. అధికారిక కార్యక్రమంలో ఎమ్యెల్యే పాల్గొనే అధికారం ఉందని, ఆయన ముఖ్యమంత్రికి కలిసి తన నియోజక వర్గ సమస్యలు మాట్లాడనివ్వాలని టిపిసిసి అధ్యక్షుడు డిమాండ్ చేశారు.