కేసీఆర్ పై అట్రాసిటీ కేసు పెట్టాలి.

హైదరాబాద్:
దళితులను చిన్నచూపు చూస్తున్న సీఎం కేసీఆర్ పై అట్రాసిటీ కేసు పెట్టాలన్నారు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య. “ఆయన మాటలు వింటే కడుపు నిండుతుంది.. ఆచరణ చూస్తే కడుపు మండుతుంద”ని విమర్శించారు. ప్రభుత్వంలో తమపై వివక్ష చూపుతున్నారని దళిత ఐఏఎస్ అధికారులే ఫిర్యాదు చేస్తున్నారన్నారు. ఏ శాఖలోనూ దళిత అధికారులు లేకుండా చేసేందుకు వారిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని మండిపడ్డారు. తనకు నచ్చిన అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తిని సీఎస్ గా పెట్టుకొనేందుకు దళితుడైన ప్రదీప్ చంద్రను కొనసాగించే అవకాశం ఉన్నా ఆయనకు పొడిగింపు ఇవ్వలేదని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో దళిత ఐఏఎస్ లకు జరుగుతున్న అన్యాయంపై కేంద్రం, జాతీయ ఐఏఎస్ ల సంఘం జోక్యం చేసుకోవాలని కోరారు.