‘క్రమశిక్షణ’ అనగా నేమి?

ఎస్.కె.జకీర్.
తెలంగాణ రాష్ట్ర సమితిలో క్రమశిక్షణా రాహిత్యం పెరుగుతున్నది. కొందరు నాయకులు, ప్రజాప్రతినిధులపై, ఫిర్యాదులు, ఆరోపణలు వచ్చినా విచారణ లేదు. చర్యలు లేవు.తాజాగా నిజామాబాద్ ఎపిసోడ్ తీసుకుంటే ఏడు నెలల క్రితం శాసనమండలి సభ్యుడు డాక్టర్ భూపతిరెడ్డిపై చర్య తీసుకోవాలని,ఆయనను సస్పెండ్ చేయాలని కోరుతూ ఆ జిల్లా ప్రజాప్రతినిధులు రాసిన లేఖ ఏమైందో ఎవరికీ తెలియదు. ‘పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న’ ఎం.ఎల్.సి. భూపతిరెడ్డి పై టిఆర్ఎస్ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆయన టీఆరెస్ లోనే కొనసాగుతున్నారు.’టిఆర్ఎస్ కు ద్రోహం తలపెట్టారని’ ఆరోపణలకు గురైన రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కు భూపతిరెడ్డి మద్దతు నిస్తున్నారు. డి.ఎస్.పై చర్య తీసుకోవాలని కోరుతూ పార్లమెంటు సభ్యురాలు కవిత సహా పలువురు ఎం.ఎల్.ఏ. లు ముఖ్యమంత్రికి లేఖ రాయడాన్ని భూపతిరెడ్డి తప్పు బట్టారు. నిజామాబాద్ జిల్లాలో అవినీతి,గ్రూప్ రాజకీయాలు పెరిగిపోయాయని,పార్టీకి వెన్నుపోటు పొడిచేవారిని గుర్తించాలని ఆయన అంటున్నారు. గతంలో కేసీఆర్ కు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులు కుట్రలు పన్నుతున్నారంటూ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారులకు పార్టీలో అన్యాయం జారుతున్నదని అన్నారు. తెలంగాణా ద్రోహుల చెప్పుడు మాటలు వినరాదని డాక్టర్ భూపతిరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. గత ఏడాది డిసెంబర్ 13 న తనను సస్పెండ్ చేయాలంటూ సి.ఎం.కు చేసిన ఫిర్యాదుపై ఇంతవరకు ఎలాంటి విచారణ జరగలేదని కూడా ఎం.ఎల్.సి అన్నారు.
భూపతిరెడ్డి మాటలను బట్టి పార్టీలో క్రమశిక్షణ లేదని, పైగా ఫిర్యాదులపైన విచారణ జరగదని అర్ధమవుతున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అసమ్మతి కుంపటి సెగలు కక్కుతోంది. నాయకుల మధ్య విభేదాలు పుంజుకున్నాయి. శాసనసభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ కు, ఎం.ఎల్.సి. భూపతిరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేయకపోయినా విబేధాలు భగ్గుమంటున్నవి.ఎమ్మెల్సీ భూపతిరెడ్డిని పార్టీ నుంచి సస్పెన్డ్ చేయాలని గత డిసెంబర్ లో పార్టీ ఇంచార్జ్‌లు కేసీఆర్‌కు లేఖ రాశారు. బాజిరెడ్డి, భూపతిరెడ్డి పరస్పరం కేసులు నమోదు చేసుకునే స్థాయికి పరిస్థితులు వెళ్లాయి. ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోరాదని ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశించినా భూపతిరెడ్డి తీరులో మార్పు రాలేదని పార్టీనేతలు అంటున్నారు.జిల్లా పార్టీ ఇంచార్జ్‌ తులఉమ, ఎంపీ కవిత ఆధ్వర్యంలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంలో భ ఎమ్మెల్యేలు సమావేశమై భూపతిరెడ్డికి వ్యతరేకంగా తీర్మానం చేశారు. ఎమ్మెల్సీపై సస్పెన్షన్‌ వేటు వేయాలని ముఖ్యమంత్రికి సిఫారస్‌ చేస్తూ లేఖ రాశారు.నేతల మధ్య ఆదిపత్యపోరును సహించేది లేదని కేసీఆర్ మొదటి నుంచి చెబుతున్నారు.కానీ ఆయన మాటలు ఖాతరు చేస్తున్న దాఖలాలు లేవు. అంతర్గతపోరు మాత్రం పొగలు కక్కుతూనే ఉంది. ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మధ్య చాలాకాలంగా పొసగడం లేదు. వీరిద్దరూ ఒకరిపై మరోకరు ఫిర్యాదు చేసుకొంటున్నారు. వీరిద్దరూ ఒకరిపై మరోకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకొన్న ఘటనలు కూడ చోటు చేసుకొన్నాయి. అయితే ఈ విషయమై ముఖ్యమంత్రి కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ తరహ ఘటనలు చోటు చేసుకోకూడదని ఆదేశించారు. రైతుల భూ ప్రక్షాళన రికార్డులకు సంబంధించి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రైతుల నుండి డబ్బులను వసూలు చేశారని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ఆరోపించారు. ఈ విషయమై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ విషయమై విచారణ జరిపించాలని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కలెక్టర్‌కు లేఖ రాశారు. తన రాజకీయ ప్రతిష్టను ఎమ్మెల్సీ దిగజార్చారని ఎమ్మెల్సీ బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపణలు గుప్పించారు. తన 35 ఏళ్ళ రాజకీయ జీవితాన్ని నాశనం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఎం.ఎల్.ఏ ఆరోపించారు.
నిజామాబాద్ జిల్లాలోని టిఆర్ఎస్ ప్రజాప్రతినిధుల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకొన్నాయి. ఎమ్మెల్సీ భూపతిరెడ్డి చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. నిజామాబాద్ జిల్లాలోని టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య కొంత కాలంగా పొసగడం లేదు. ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మధ్య పొసగడం లేదు.ఈ తరుణంలో వీరిద్దరూ కేూడ కొంత కాలంగా ఒకరిపై మరోకరు ఫిర్యాదు చేసుకొంటున్నారు గతంలో కూడ ఇదే రీతిలో వీరిద్దరూ ఒకరిపై మరోకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకొన్న ఘటనలు కూడ చోటు చేసుకొన్నాయి. అయితే ఈ విషయమై ముఖ్యమంత్రి కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ తరహ ఘటనలు చోటు చేసుకోకూడదని కూడ ఆదేశించారు. తాజాగా ఇదే తరహ ఘటన ఒకటి వెలుగుచూసింది. రైతుల భూ ప్రక్షాళన రికార్డులకు సంబంధించి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రైతుల నుండి డబ్బులను వసూలు చేశారని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ఆరోపించారు. ఈ విషయమై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ విషయమై విచారణ జరిపించాలని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కలెక్టర్‌కు లేఖ రాశాడు. తన రాజకీయ ప్రతిష్టను ఎమ్మెల్సీ దిగజార్చారని ఎమ్మెల్సీ బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపణలు గుప్పించారు. తన 35 ఏళ్ళ రాజకీయ జీవితాన్ని నాశనం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనపై ఎమ్మెల్సీ చేసిన ఆరోపణలపై విచారణలో వాస్తవాలు తేలుతాయని ఆయన చెప్పారు. ఈ లేఖ ఆధారంగా విచారణ జరిపించాలని కలెక్టర్‌ డిఆర్వోకు ఆదేశాలు జారీ చేశారు. దోషులుగా తేలినవారిపై చర్యలు తీసుకోవాలని బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేస్తున్నారు.