ఖమ్మం – రాజమండ్రి జాతీయ రహదారి కి త్వరలో టెండర్లు.

హైదరాబాద్:
ఖమ్మం రాజమండ్రి జాతీయ రహదారి నమూనాలను పరిశీలించిన మంత్రి తుమ్మల. జాతీయ రహదారి రహదారుల ప్రాధికార సంస్థ అధికారులుతో తమ క్యాంపు కార్యాలయంలో సమావేశమైన మంత్రి తుమ్మల భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడీ అభీష్టానుసారం ఖమ్మం – రాజమండ్రి జాతీయ రహదారి అనుసంధానానికి ప్రణాళికలు రచించిన జాతీయ రహదారుల ప్రాధికారసంస్థ అధికార వర్గం. ఈ రహధారి నిడివి 167 కిలోమీటర్లుగా నిర్ధారించారు. ఈ రహధారి మొత్తం గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేయనున్నారు. గతంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణ రాష్ట్రనికి అనుమతించిన ప్రాజెక్టుల లో భాగంగా ఈ రహదారిని రూపొంధించారు. ఎంతో విలువైన అనుసంధానాన్ని కలిగించడమే కాకుండా బాగా వెనుకబడిన ప్రాంతాల మండలాలైన కుసుమంచి అశ్వరావుపేట రైతులకు తమ ప్రాంతాల నుండి సమీప మార్కెట్టు లకు తమ ఉత్పత్తుల తరలింపునకు చాలా అనుకూలంగా ఉండగలదు. ఖమ్మం నుంచి రాజమండ్రి వెళ్లే జాతీయ రహదారి అనుసంధానానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు ప్రణాళికలు రచించారు. ఈ నిడివి మొత్తం 167 కిలోమీటర్ల కాగా ఈ మొత్తం గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేయనున్నారు. ఎక్కడ కూడా నివాస ప్రాంతాలు, చెరువులు, కుంటలు, ఆలయాలు వంటి ఏ విధమైన అడ్డంకులు లేకుండా ఈ యొక్క మొత్తం రహదారిని రూపొందించారు. గతంలో ఖమ్మం నుండి అశ్వరావుపేట పట్టణానికి కలిపే రహదారి నమూనాను భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ఆదేశాల అనుసారం ఖమ్మం నుండి రాజమండ్రికి అనుసందనం కలిగించే విధంగా ఈ ప్రణాళికలు రూపొందించారు. ఈ మార్గం లో ఖమ్మం – రాజమండ్రి రహధారి అనుసందానము వలన రాజమండ్రి నుండి హైదరాబాదుకు ప్రయాణించే ప్రయాణికులకు మొత్తంగా 80 కిలోమీటర్ల నిడివి తగ్గనుంది. ఈ రహధారి విజయవాడ నగరంపై ఉండే వత్తిడిని, రద్దీని తగ్గించడానికి ఉపయోగ పడుతుంది. రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్టణం వంటి ముఖ్య నగరాలను హైదరాబాదుకు అనుసంధానించడానికి ఈ రహదారి ఎంతో ఉపయోగంగా ఉంటుంది భవిష్యత్తులో ఆయా పట్టణాల నుంచి హైదరాబాదుకు ప్రయాణించేవారికి సమయము డబ్బు ఆదా అవ్వడమే కాకుండా ఎంతో విలువైన ఇంధనం కూడా ఆదా అయ్యే విధంగా ఈ ప్రణాళికను తీర్చిదిధ్ధినారు. వచ్చే 15 రోజుల్లోగా భూసేకరణ పూర్తిగావించి టెండర్లు ఖరారు చేయనున్నామని జాతీయ రహదారి ప్రాధికార సంస్థ అధికారి తెలిపారు.