‘గంగుల’ కు తప్పని గట్టి పోటీ. ‘కొత్త’ సమీకరణలు.

ఇటీవల ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు కరీంనగర్ వచ్చిన మంత్రి కేటీఆర్ గంగుల కమలాకర్‌ ప్రత్యర్థి  కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు  చల్మెడ లక్ష్మీనర్సింహారావు మెడికల్ కళాశాలలోని గెస్ట్‌హౌస్‌కు వెళ్లడం ఆశ్ఛర్యాన్ని కలిగించింది. గంగులపై కాంగ్రెస్ అభ్యర్థిగా లక్ష్మణ్ రెండుసార్లు పోటీ చేసి అయిపోయారు. కేటీఆర్ వైఖరి   గంగులకు టిక్కెట్‌ విషయంలో లోలోపల ఏదో జరుగుతోందనే ప్రచారానికి బలం చేకూర్చుతున్నది. కొత్త ముఖం, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనే జైపాల్ రెడ్డి వైపు ఏ.ఐ.సి.సి.అధ్యక్షుడు రాహుల్ గాంధీ మొగ్గుచూపే అవకాశాలు లేకపోలేదు. కాంగ్రెస్ టికెట్టు ఖరారైతే  కరీంనగర్ లో తెలంగాణా రాష్ట్ర సమితిని చిత్తు చేయడానికి కొన్ని నెలల నుంచే జైపాల్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది.

కరీంనగర్;
కరీంనగర్ సెంబ్లీ నియోజకవర్గంలో శాసనసభ్యుడు గంగుల కమలాకర్ కు గట్టి పోటీ తప్పదు. ఆయన గెలుపు సునాయసం కాదన్నది ఒక విశ్లేషణ. రాజకీయాలు రక్తి కడుతున్నాయి. కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్‌ తరపున బరిలోకి దిగేందుకు ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, ఆర్ధికంగా బలంగా ఉన్న కొత్త జయపాల్‌రెడ్డి వంటి వారు ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి కరీంనగ జిల్లా గ్రానైట్ క్వారీ ఓనర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న కొత్త జైపాల్ రెడ్డి ఇంతకు ముందు బీజేపీలో క్రియాశీలంగా పనిచేశారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నాగం జనార్దన్ రెడ్డి కి ప్రియశిష్యుడు. కొత్త ముఖం, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనే జైపాల్ రెడ్డి వైపు ఏ.ఐ.సి.సి.అధ్యక్షుడు రాహుల్ గాంధీ మొగ్గుచూపే అవకాశాలు లేకపోలేదు. కాంగ్రెస్ టికెట్టు ఖరారైతే కరీంనగర్ లో తెలంగాణా రాష్ట్ర సమితిని చిత్తు చేయడానికి కొన్ని నెలల నుంచే జైపాల్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. గులాబీ పార్టీకి సెంటిమెంటుగా , రాజకీయంగా కలిసొచ్చిన జిల్లాగా కరీంనగర్ కు గుర్తింపు ఉన్నది. సమీకరణలు మారుతున్నవి. తెలంగాణా ఉద్యమానికి ఓ ఊపు తెచ్చి గత ఎన్నికల్లో 13 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను ఏకంగా 12 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలను తెలంగాణ రాష్ట్ర సమితి కైవసం చేసుకున్నది . అయితే ఇప్పటివరకూ ఉమ్మడి జిల్లా కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న టీఆర్ఎస్ లో రాబోయే ఎన్నికల్లో ఏం జరుగబోతోంది..? సిట్టింగ్ కే అధికారపార్టీ సీటు మళ్ళీ దక్కుతుందా.. ? లేక ఇంకెవరికైనా ఆ సీటు ఇవ్వబోతున్నారా…? ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేకు మొండిచేయి చూపిస్తే ప్రత్యామ్నాయం ఎవరు .? టిక్కెట్ ఇప్పుడున్నవారికి దక్కకుంటే, సామాజిక సమీకరణాలు ఏమేరకు ప్రభావితం చేయనున్నాయనే విషయాలపై చర్చ జరుగుతున్నది. కరీంనగర్ అధికార పార్టీ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గంగుల అంతకుముందు టీడీపీ నుంచి గెలిచారు. 2014లో ఎమ్మెల్యే గా గెలిచారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అనుసరిస్తున్న విధానాలు, గ్రానైట్, ఇసుక, హోటల్ కోసం భూ కబ్జా, వక్ఫ్ బోర్డు భూములను ఆక్రమించి ఫాంహౌస్ నిర్మించుకున్నారనే ఆరోపణలను ‘ గంగుల’ ఎదుర్కుంటున్నారు. కరీంనగర్ పట్టణంలో ఓ సిటీకేబుల్ ఛానల్ పెడదామని ఇతరులు యత్నించినప్పుడు వారిని అడ్డుకుని దౌర్జన్యంగా ఆపడం,తనకు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేసిన ఛానల్స్ లో ప్రసారాలు నిలిపివేయడం వంటి విమర్శలున్నవి. పలు వివాదాలతో తనకున్న ఇమేజ్ ను ఆయనే డ్యామేజ్ చేసుకున్నారన్న అపవాదు ఉన్నది. అధికారులతో వ్యవహరించే తీరు పలు సందర్భాలలో విమర్శల పాలవుతున్నది. స్థానికంగా మున్సిపల్ కార్పోరేషన్ పనుల్లో అంతా తానే చక్రం తిప్పా లనుకునే ప్రయత్నాలు విఫలమవుతున్నవి. మేయర్ రవీందర్ సింగ్ తో పొసగడం లేదు. సీఎం కేసీఆర్ చేయించిన సర్వేల్లోనూ గంగుల కు బొటాబొటీ మార్కులు పర్లేదని వచ్చాయని తెలుస్తున్నది. లోలోపల గట్టెక్కడం కష్టమేనన్న సంకేతాలే ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కరీంనగర్‌ను ‘స్మార్ట్‌సిటీ’గా కేంద్రం ప్రకటించినప్పటికీ ఎం.ఎల్.ఏ గంగుల దానికనుగుణంగా నగరాభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయడం లేదన్న విమర్శలు ఉన్నవి. కాగా ఇటీవల ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు కరీంనగర్ వచ్చిన మంత్రి కేటీఆర్ గంగుల కమలాకర్‌ ప్రత్యర్థి కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు చల్మెడ లక్ష్మీనర్సింహారావు మెడికల్ కళాశాలలోని గెస్ట్‌హౌస్‌కు వెళ్లడం ఆశ్ఛర్యాన్ని కలిగించింది.గంగులపై కాంగ్రెస్ అభ్యర్థిగా లక్ష్మణ్ రెండుసార్లు పోటీ చేసి అయిపోయారు. కేటీఆర్ వైఖరి గంగులకు టిక్కెట్‌ విషయంలో లోలోపల ఏదో జరుగుతోందనే ప్రచారానికి బలం చేకూర్చుతున్నది. అయితే చల్మెడ లక్ష్మణ్ ను వేములవాడ నుంచి టిఆర్ ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగాలని కేటీఆర్ కోరుతున్నట్టు సమాచారం. ఇందుకు ఆయన అంగీకరించకలేదని కరీంనగర్‌ టికెట్టు కోరుతున్నట్టు సమాచారం. పదేళ్ల కిందటి వరకు కరీంనగర్‌ నుంచి వెలమ సామాజికవర్గమే ప్రాతినిధ్యం వహించింది. తమ ఉనికిని మళ్ళీ ప్రదర్శించడానికి వెలమలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది. వెలమ సామాజికవర్గం ‘గంగుల’కు చెక్‌ పెట్టేందుకు పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ తనకు మిత్రుడైన బీసీ సామాజికవర్గానికే చెందిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌తో టచ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. టీఆర్ఎస్‌ టిక్కెట్‌ తనకు దక్కని పక్షంలో కారు దిగి బీజేపి, లేదంటే కాంగ్రెస్‌ వైపు జంప్ చేయడానికి గంగుల కమలాకర్ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలియవచ్చింది. తనకు ‘చెక్‌’ పెట్టాలని చూస్తున్న వెలమ సామాజికవర్గాన్ని దెబ్బకొట్టి, బీసీ సామాజికవర్గ బలమేంటో నిరూపించాలని ఆయన మనసులో అనుకుంటున్నట్టు ఒక ప్రచారం ఉన్నది. అయితే కరీంనగర్‌లో కమలాకర్ సామాజికవర్గానికే చెందిన బీజేపి నాయకుడు బండి సంజయ్ ఇప్పుడు కమలాకర్‌కున్న పెద్దముప్పుగా పరిణమిస్తున్నట్టు రాజకీయ పరిశిలకుల అంచనా. గత ఎన్నికల్లో చల్మెడ లక్ష్మీనర్సింహారావును కన్నా ఎక్కువ ఓట్లతో బండిసంజయ్‌ రెండో స్థానాన్నీ సాధించడం విశేషం. ఇప్పుడు బండిసంజయ్‌ బీజేపి అభ్యర్థిగా గట్టి పోటీ ఇవ్వనున్నారు. టీఆర్ఎస్‌ నుంచి గంగుల కాకుంటే చల్మెడ లక్ష్మీనర్సింహరావు ప్రధాన ఆప్షన్‌. అయితే చల్మెడ అదే కాంగ్రెస్‌ నుంచి మళ్లీ బరిలోకి దిగినా, కరీంనగర్‌ నుంచి గంగులనే మళ్లీ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే కరీంనగర నియోజకవర్గంలో మొత్తం 3 లక్షల 7 వేల 299 మంది ఓటర్లకు పైగా ఉండగా‌ ముస్లిం మైనార్టీల ఓట్లు ఇక్కడ కీలకం. ముఖ్యంగా కరీంనగర్ పట్టణంలో 40 శాతం ఓట్లు ముస్లిం మైనార్టీలవే ఉన్నవి. వారు ఎన్నికలను ప్రభావితం చేసే ఓటర్లుగా పేరుంది. బీసీ సామాజికవర్గానికి దూరమైపోతామనే భయంతో… అధికార టీఆర్ఎస్‌ గంగులకే మళ్లీ టిక్కెటిస్తుందా…? లేక బీజేపి నేత బండిసంజయ్‌ కూడా బీసీ సామాజికవర్గానికి చెందినవాడే కావడంతో ఆయనకు గాలం వేస్తారా ? తెలియదు. వెలమ సామాజికవర్గానికి ఆ టిక్కెటిచ్చి గెలిపించుకోవాలని చూస్తున్నారా? లేక ఇంకెవరైనా బరిలోకి దిగనున్నారా? అన్నవి ఇప్పుడు హాట్‌టాపిక్‌.