‘గంప’కు ఓటేస్తే గజదొంగకు వేసినట్టే. కామారెడ్డిలో రేవంత్ కు నీరాజనాలు.

కామారెడ్డి:

టిఆర్ఎస్ పార్టీ అడవి పందుల వ్యవస్థ అని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. కామారెడ్డి జిల్లా బస్వాపూర్ గ్రామం వద్ద ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.రేవంత్ కు నీరాజనాలు పలికారు. కాంగ్రెస్ అభ్యర్ధి షబ్బీర్ అలీ తరపున రేవంత్ రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో కు అనూహ్య స్పందన లభించింది.కామారెడ్డి ఎమ్మెల్యే గంప గొవర్దన్ తట్ట బట్ట మడుచుకపొయే రోజులు వచ్చాయని ఆయన అన్నారు.గంప‌కి ఒటు వేస్తే గజ దొంగ కి ఒటు వేసినట్టేనని చెప్పారు. పేదొల్లకి డబుల్ బెడ్ రుం,దళితులకి ముడేకారల భుమి,లక్ష రూపాయల రుణ మాఫి కాలేదు,చదువుకున్న విద్యార్థులకి నౌకర్లు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో ఉన్న ఈ ‌ఉత్సహం ఎన్నికల వరకు ఉండాలని కోరారు.బడుగు, బలహీన వర్గాల కొసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని రేవంత్ చెప్పారు.