సికింద్రాబాద్:
గాంధీ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఓంకార్(11 )మృతి చెందాడు. దీంతో గజ్వేల్ రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య 12 కు చేరింది.
రాజీవ్ రహదారి ప్రజ్ఞాపూర్ సమీపంలోని రిమ్మనగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద బాధితులకు మంచి వైద్యం అందించాలని వైద్యశాఖ అధికారులు, జిల్లా వైద్యాధికారి, వైద్యులను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి ఆదేశించారు.క్షత గాత్రులకు గజ్వేల్లో ప్రాథమిక చికిత్స చేసి, సీరియస్గా ఉన్న వాళ్ళని అవసరమైతే హైదరాబాద్లోని నిమ్స్, గాంధీ, ఉస్మానియా దవాఖానాలకు తరలించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
క్షత గాత్రులకు యుద్ధ ప్రాతిపదికల వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.జరగిన సంఘటనపై మంత్రి
విచారం వ్యక్తం చేశారు.చనిపోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.20మంది క్షత గాత్రులను స్వయంగా గాంధీకి తరలించారు.
గాంధీలో క్షతగాత్రులకు తగు వైద్యం అందే విధంగా అనెస్తీషియా, ఆర్తో తదితర డాక్టర్లు, సిబ్బంది, బెడ్స్ని, అవసరమైన మందులను సూపరింటెండెంట్ సిద్ధం చేశారు. అత్యవసర పరిస్తితిలో 45 మంది వైద్యులను గాంధీ కి రప్పించారు.