గర్భవతుల గోస !

  • ఖమ్మం ఆస్పత్రిలో 254 మందికి
    ఒకే వైద్యురాలు.

ఖమ్మం:
కేసీఆర్‌ కిట్‌ ప్రభావంతో ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతోంది. ఖమ్మం జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని మాతాశిశు సంరక్షణ విభాగానికి వచ్చి వైద్యం చేయించుకుంటున్న గర్భవతుల సంఖ్య కూడా గతం కంటే పెరిగింది. కాగా, పరీక్షలు చేయించుకునే క్రమంలో వారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఒక్కరోజే జిల్లా ప్రధాన వైద్యశాలకు 254 మంది గర్భవతులు పరీక్షలకు రాగా వారిలో 100 మందికిపైగా 9వ నెల సమీపించిన వారున్నారు. ఈ నేపథ్యంలో మాతాశిశు సంరక్షణ విభాగంలో నిత్యం ఇద్దరు మహిళా వైద్యులకు ఓపీ పరీక్షల విధులు కేటాయిస్తారు. సోమవారం ఒకే వైద్యురాలు వస్తుండడంతో గంటల కొద్ది క్యూలో నిలుచోవాల్సిన పరిస్థితి. పీజీ వైద్యులు వెళ్లిపోవడంతో డాక్టర్ల కొరత ఉందని మాతాశిశుసంరక్షణ విభాగం పర్యవేక్షకుడు డాక్టర్‌ వెంకటేశ్వర్లు చెప్పారు.