సంగారెడ్డి:
గుండెపోటుతో సబ్ఎడిటర్ ఎం.ఆనంద్‌కుమార్ హఠాన్మరణం చెందారు. హైదరాబాద్‌లోని హుమయూన్‌నగర్‌కు చెందిన మర్రి ఆనంద్‌కుమార్(62)కు మంగళవారం ఉదయం గుండెపోటు రావడంతో కుటుంసభ్యులు సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన సాయంత్రం మరణించారు. ఆనంద్ దాదాపు రెండు దశాబ్దాలుగా జర్నలిజంలో ఉన్నారు. గతంలో ఆంధ్రప్రభలో పనిచేశారు. పదకొండేళ్లుగా ఆంధ్రజ్యోతి మెదక్ డెస్క్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆనంద్ సతీమణి శారద కూడా ఆంధ్రజ్యోతిలో సబ్ఎడిటర్గా పనిచేస్తున్నారు. వీరికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఆనంద్ మృతి పట్ల ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, న్యూస్‌నెట్‌వర్క్ ఇన్చార్జి శ్రీకృష్ణప్రసాద్, అసిస్టెంట్ ఎడిటర్ వక్కలంక రమణ సంతాపం ప్రకటించారు. సోమవారం రాత్రి వరకు విధులు నిర్వర్తించిన ఆనంద్.. హఠాత్తుగా మృతి చెందడాన్ని తోటి పాత్రికేయులు జీర్ణించుకోలేకపోయారు. ఆయన అంత్యక్రియలు బుధవారం జరగనున్నాయి.