గుండ్రంగా తిరిగే పంచదార కారు.

న్యూఢిల్లీ:
ఎప్పటికప్పుడు సాంకేతికత మరియు ఆవిష్కరణలతో ప్రపంచం పరుగులు పెడుతోంది. ముఖ్యంగా వాహన రంగంలో ఇది కొత్త పుంతలు తొక్కుతోంది. టియు ఐండ్హోవెన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన కొందరు విద్యార్థులు ఓ ఎలక్ట్రికల్ కారును తయారుచేశారు. తిరిగి వినియోగించే పదార్థాలతో తయారైన ఈ కారు సంప్రదాయేతర ఇంధన వనరులను వాడుకొని రోడ్లపై పరుగులు పెడుతుంది. ఇద్దరు కూర్చొనే వీలుండే ఈ ఎలక్ట్రిక్ కారుకి నోవా అని పేరు పెట్టారు. ఇప్పటికే ప్రపంచానికి పరిచయమైన ఈ కారు త్వరలోనే విశ్వవ్యాప్తంగా వివిధ దేశాలలో అమ్మకానికి రానుంది. నోవా ఎలక్ట్రిక్ సిటీ కార్ ఛాసిస్, ఇంటీరియర్స్, బాడీ ప్యానెల్స్ అన్నీ కూడా అవిసె గింజలు ప్రధానంగా తయారయ్యాయి. క్రమబద్ధమైన ఉత్పత్తి ప్రక్రియతో పాటుగా తిరిగి వాడుకొనేలా ఉండేందుకు జీవమిశ్రమాలను విరివిగా ఉపయోగించారు. పాలీప్రొపలీన్ కు బదులు పంచదారను వాడారు. కారులో 90 శాతం మేర వాడిన పదార్థాలన్నీ ప్రకృతిలో దొరికేవి, తిరిగి వినియోగించగలిగేవి కావడం విశేషం. ఈ కారు మొత్తం బరువు 350 కిలోలు మాత్రమే. దీంతో ఇది ప్రపంచంలోనే ఇది అతి తేలికైన కారుగా గుర్తింపు పొందింది.
నోవా గరిష్ఠంగా గంటలకు 100 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసింది. ఎలక్ట్రిక్ రేంజ్ లో అయితే గంటలకు 240 కిలోమీటర్ల వేగం అందుకుంది. యాక్సిలరేషన్ సమయంలో 97 శాతం మైలేజీతో, స్థిరమైన వేగంతో వెళితే 100 శాతం ఇంధన వినిమయ సామర్థ్యం సాధిస్తుందని తయారీదారులు నమ్మకంగా చెబుతున్నారు.