గుడి లో కేసీఆర్, మడి లో బాబు.

విజయవాడ:
గురువారం రెండు అపురూప దృశ్యాలు చూపడానికి ‘సమైక్య’మీడియా తంటాలు పడింది. తెలంగాణ రాష్ట్ర కల సాకారం అయినందుకు టి.ఎస్.సి.ఎం.కేసీఆర్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గగుడిలో అమ్మవారికి ముక్కుపుడక సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారమే ‘ఏరువాక’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రుల కార్యక్రమాలను ఒకేసారి లైవ్ ప్రసారం చేయడానికి పలు టి.వి.చానళ్లు శక్తి వంచన లేకుండా ప్రయత్నించాయి.