‘గొర్రెలు’ కెసిఆర్ పరువు తీయునా!!

కెసిఆర్ అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ పథకం పై ఆ కులానికి చెందిన ప్రొఫెసర్ కంచెఐలయ్య,ప్రొఫెసర్భీమవేని రాం షెఫర్డ్ తదితరులు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.అత్యంతవెనుకబడిన,సంచార జాతి అయిన గొల్ల కురమలను కేవలం ఓటుబ్యాంకు గా చూస్తూ ఈ పధకాలను అమలు చేస్తున్నారని ప్రొఫెసర్ రాం షెఫర్డ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “ 20 గొర్రెలు ఒక కుటుంబం పోషణకు సరిపోవు. కనీసం కూలీ కూడా గిట్టదు.అర్హులైన వారంతా దరఖాస్తు పెట్టుకోవాలని ప్రభుత్వం కోరడంతో ఉన్నత విద్యావంతులైన నిరుద్యోగులు కూడా గొర్రెలు కాయడానికే సిద్ధపడుతున్నారు. తాను 4 వతరగతి లో ఉండగా గొర్రెలు కాశాను.ఇప్పుడు మళ్ళీ గొర్రెల కాపరి పని చేస్తున్నట్టు ఒక పి.హెచ్.డి.విద్యార్థిచెప్పాడు. నేనతన్ని ఫోన్ చేసి చీవాట్లుపెట్టాను.ఉస్మానియా యూనివర్సిటీలో పి.హెచ్.డి.ని మధ్యలో వదలొద్దు. భవిష్యత్తు నాశనం అవుతుందని నచ్చజేప్పాను. అతను తిరిగి హైదరాబాద్ వచ్చాడు. డబ్బులు లేకపోవడమే పేదరికం కాదు. సాంస్కృతిక పేదరికం అత్యంత ప్రమాదకరం. భూమిఇవ్వకుండా,శాశ్వత ఉపాధి చూపకుండా గొర్రెల యూనిట్లు ఇచ్చి గొల్ల కురమల జీవితాలను ఉద్ధరిస్తున్నట్టు ప్రచారం చేసుకోవడం బూటకం. ప్రభుత్వం నుంచి గొర్రెలు తీసుకొని మేపుకొంటున్న కాపరులపై పలు చోట్ల రెడ్డి కులస్తులు దాడులు చేస్తున్నారు.మీరు వెలమలకే ఓటు వేస్తారన్నది రెడ్ల అభియోగం. గొర్రెల పంపిణీ పధకం తర్వాత స్కూల్ డ్రాపౌట్ లు పెరిగాయి.పిల్లల్ని బడి మాన్పిస్తున్న సంఘటనలు ఉన్నాయి. వీటిపై సమగ్ర అధ్యయనం జరగాలి.

హైదరాబాద్;
గొర్రెల పంపిణీ పధకం కెసిఆర్ ప్రభుత్వపరువుతీసే ప్రమాదం కనిపిస్తున్నది.ఈ పధకంలో అడుగడుగునా అవకతవకలు,లోపభూయిష్టంగా అమలు జరుగుతున్న తీరు ఇందుకు కారణం. ముఖ్యమంత్రి కేసీఆర్ గొల్లకురుమలకు జీవనోపాధి కల్పించేందుకు ఈ పధకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పధకం వలన రాష్ట్రంలో గొల్లకురుమల జీవన ప్రమాణాలు మెరుగుపడి, రాష్ట్రం మాంసం ఉత్పత్తిలో ముందంజ వేస్తుందని భావించారు. ప్రభుత్వానికి పేరుప్రతిష్టలు వస్తాయని ఆయన ఆశించారు. కానీ ఈ పధకం అమలులో ఎదురవుతున్న ఊహించని సమస్యలు, లోటుపాట్లు, అక్రమాలు వంటివి ఆ లక్ష్యాన్నే దెబ్బతీస్తున్నాయి. చివరికి అప్రదిష్టపాలయ్యే ప్రమాదం కూడా ఉంది. ప్రభుత్వం అందిస్తున్న గొర్రెలను వాటి యజమానులు డబ్బుకు ఆశపడి దళారులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. అవి ఆంధ్రా, చుట్టుపక్కల రాష్ట్రాలకు తరలి వెడుతున్నాయి. మళ్ళీ వాటినే తెలంగాణా అధికారులకు ఒక్కో యూనిట్ రూ.1.25 లక్షలకు అమ్ముతున్నారని సమాచారం. మహబూబాబాద్ పట్టణం నుంచి 60 గొర్రెలను లారీలలో పొరుగు రాష్ట్రానికి తరలిస్తుండగా పోలీసులు ఆ గొర్రెల లారీని పట్టుకొన్నారు. ఆ గొర్రెలను పొందిన తొగరి నవీన్, ఐలయ్య, యాకబోయిన వెంకన్నలు వాటిని విక్రయించినట్లు లారీ డ్రైవర్ తెలిపారు. ఒక్కో యూనిట్ (21 గొర్రెలను) రూ.70 వేల చొప్పున మూడు యూనిట్లను రూ.2.1 లక్షలకు అమ్మినట్లు వారు తెలిపారు. ఈవిధంగా రూ.70 నుంచి 80 వేలకు గొర్రెలను కొని వాటిని పొరుగు రాష్ట్రాలకు తరలించి మళ్ళీ వాటినే రూ.1.25 లక్షల చొప్పున తెలంగాణా అధికారులకు అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇతర జిల్లాల్లోనూ ఇదే దందాసాగుతున్నది. గొర్రెలను కొనుగోలుచేయడానికి గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నారు.
రాష్ట్రంలో ఉన్న 4 లక్షల గొల్ల, కుర్మ కుటుంబాలకు రూ. 5 వేల కోట్లతో రెండేండ్లలో84 లక్షల గొర్రెలను పంపిణీ చేస్తోంది.ఒక్కో కుటుంబానికి 75 శాతం సబ్సిడీతో 20+1 చొప్పున గొర్రె పిల్లలను అందిస్తున్నారు. లబ్ధిదారులకు సొసైటీ సభ్యత్వ నిబంధన అమలు చేస్తున్నారు. ఒక్కో యూనిట్‌కు (21 గొర్రెలకు) రూ. 1.25లక్షలు గరిష్ఠ ధరగా నిర్ణయించి అమలు చేస్తున్నారు. ఈ పథకానికి కావలసిన గొర్రెపిల్లలను ఇతర రాష్ర్టాల్లో కొనుగోలు చేస్తున్నారు. అక్కడే ట్యాగ్ వేసి అక్రమాలు జరుగకుండా జాగ్రత్త పడాలని గతంలోకేబినేట్ ఉపసంఘం పేర్కొంది. లబ్ధిదారుల ఎంపికకు ఉపసంఘం పలు మార్గదర్శకాలు సూచించింది. సబ్సిడీపై గొర్రెలు తీసుకోవాలంటే గొర్రెల పెంపకం సొసైటీలలో తప్పనిసరి సభ్యత్వం ఉండాలనే నిబంధన విధించాలని పేర్కొంది. లబ్ధిదారుల ఎంపికలో ముందుగా గొర్రెలు లేనివారికి ప్రాధాన్యం ఇవ్వాలని ఉపసంఘంసిఫారసు చేసింది. గొర్రెల సైక్లింగ్‌కు (అక్రమాలకు) అవకాశమివ్వరాదని ఉపసంఘం హెచ్చరించినా ఆచరణలో రీ సైక్లింగును ప్రభుత్వ యంత్రాంగం అరికట్టలేకపోతున్నది. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి గొర్రెలను కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన ప్రాంతంలోనే గొర్రెలకు ఇన్సూరెన్స్ ట్యాగ్(పోగు) వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారుల ఎంపిక పూర్తయిన తర్వాతే రాష్ట్ర స్థాయిలో టెండర్లు పిలవాలని, టెండర్లు దక్కించుకున్న వారే లబ్ధిదారులకు వారి వారి గ్రామాల్లో గొర్రెలను సరఫరా చేయాలన్న షరతు విధించాలని పేర్కొంది. గొర్రెల పంపిణీలో యూనిట్ ధర రూ. 1.25 లక్షలుగా ఉపసంఘ సభ్యులు నిర్ణయించారు. గొర్రెల రవాణా, ఇన్సూరెన్స్ ఖర్చులు కూడా ఇందులోనే కలపాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 42 లక్షల జీవాలను పంపిణీచేశారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన గొర్రెల నుంచి 15.50 లక్షల పిల్లల పునరుత్పత్తి జరిగి 700 కోట్ల రూపాయల విలువైన సంపద లభించింది. ఈ పథకంపై ప్రగతి నివేదికను తెలంగాణ రాష్ట్ర గొర్రెల, మేకల అభివృద్ధి సమాఖ్య ఎండీ డాక్టర్ వీ లక్ష్మారెడ్డి ఇటీవల విడుదల చేశారు. ఈ పథకం కింద ఇప్పటివరకు గొల్ల, కురుమలకు2 లక్షల 235 గొర్రెల యూనిట్లను పంపిణీ చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. దీనికోసం 2 వేల 502 కోట్లు ఖర్చుచేయగా, ఇందులో ప్రభుత్వం వాటాగా ఒక వెయ్యి 877 కోట్లు, లబ్దిదారులు తమ వాటాగా 625 కోట్లు చెల్లించినట్టు తెలిపారు. గొర్రెల ఆరోగ్య పరిరక్షణ కోసం యూనిట్ కు 425 రూపాయల చొప్పున 6 కోట్ల రూపాయలు విడుదల చేశామని, మెడికల్ కిట్స్ తో గొర్రెల ఆరోగ్య శిబిరాలు నిర్వహించామని తెలిపారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున 100 సంచార పశువైద్య అంబులెన్స్ లను అందుబాటులోకి తీసుకొచ్చారు. కామారెడ్డి జిల్లాలో 8 వేల195 యూనిట్లు,జగిత్యాలలో 9,739, కుమ్రంభీం-అసిఫాబాద్ జిల్లాలో 2,052 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు. జోగుళాంబగద్వాలలో8,665, వరంగల్ అర్బన్ లో 4,896, నిజామాబాద్ లో 8,254, మంచిర్యాలలో 4,874, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6 వేల716 గొర్రెల యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4,406, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 7,364, ఆదిలాబాద్ జిల్లాలో 3,251, మేడ్చల్ జిల్లాలో 2 వేల193 గొర్రలయూనిట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. సంగారెడ్డి జిల్లాలో 11 వేల 195, మహబూబాబాద్ లో 8,161, వరంగల్ రూరల్ జిల్లాలో7,925, జనగామ జిల్లాలో 6వేల 573 యూనిట్లను పంపిణీ చేశారు. పెద్దపల్లి జిల్లాలో 6వేల448 యూనిట్ల గొర్రెలు, సిద్దిపేట జిల్లాలో 9,608, మెదక్ జిల్లాలో 5,532, వికారాబాద్- జిల్లాలో 5 వేల470 గొర్రెల యూనిట్లను సరఫరా చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 7,369, వనపర్తి జిల్లాలో 5,343 నాగర్ కర్నూల్ 8 జిల్లాలో 513, మహబూబ్ నగర్ జిల్లాలో 11 వేల451, నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 13వేల 264 గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. ఖమ్మం జిల్లాలో 6 వేల141 యూనిట్లు, కరీంనగర్ జిల్లాలో 4వేల 640, సూర్యాపేట జిల్లా 5,095, నిర్మల్ జిల్లాలో 2,201, రంగారెడ్డి జిల్లాలో 4,701 యూనిట్ల జీవాలతో కలిపి మొత్తం 2 లక్షల 235 గొర్రెల యూనిట్లు పంపిణీ చేశారు. తెలంగాణలో 96శాతం ప్రజలు మాంసాహారులున్నారు. డిమాండ్ మేర మాంసం ఉత్పత్తి లేకపోవడంతో పక్క రాష్ట్రాల నుంచి ప్రతి రోజు 600 లారీల గొర్రెలు దిగుమతి జరుగుతున్నది. ఇలా దాదాపు 2 లక్షల కిలోల మాంసాహారాన్ని తెలంగాణ దిగుమతి చేసుకుంటున్నది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న ఆ దాణాను కూడా అమ్మేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. వనపర్తి జిల్లాలో ఈ అక్రమ దందా గుట్టు రట్టయింది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే విధంగా పలుచోట్ల ‘దాణా’ మాయమవుతుండవచ్చును. విచారణ జరిపితే కోట్లాది రూపాయల స్కాం బయటకు వచ్చే అవకాశం ఉంది. సబ్సిడీ గొర్రెలకు దాణా పంపిణీ పేరిట పశు వైద్యాధికారులు పశు సంవర్థక శాఖ అధికారులు గొర్రెలకాపర్ల సహకార సంఘాల సభ్యులు ఈ దందాకుతెరలేపారు.వనపర్తి జిల్లాలో మొదటి విడతలో 11,890 మంది రెండో విడతలో 11,820 మంది లబ్ధిదారులను ఎంపిక చేసింది. మొదటి విడతలో ఇప్పటి వరకు 9,167 యూనిట్లను అందజేసింది. కానీ పంపిణీ చేస్తున్న సమయంలోనే చాలావరకు యూనిట్లనురీసైక్లింగ్‌ చేశారు. మరి కొంతమంది అమ్మేసుకున్నారు. పంపిణీ చేసిన గొర్రెల పోషణకు ఇబ్బంది కాకుండా దాణా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఒక్కో యూనిట్‌కు 206,300 కిలోల దాణా ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. ప్రతి జిల్లాలో పంపిణీ చేసిన యూనిట్ల ఆధారంగా ఇండెంట్‌ తీసుకొని అందులో సగం వరకు సరఫరా చేసింది. వనపర్తి జిల్లా నుంచి  టన్నులకు ప్రతిపాదన పంపగా ఇప్పటివరకు 671 టన్నులు సరఫరా చేసింది. అన్ని జిల్లాల్లో పశు వైద్యాధికారులు సిబ్బంది ప్రతిష్ఠాత్మకంగా పంపిణీని ప్రారంభించారు. వనపర్తి జిల్లాలో కూడా 75 శాతం దాణాను లబ్ధిదారులకు పంపిణీ చేశామని అధికారులు చెబుతున్నారు. అయితే గ్రామాల్లో సబ్సిడీ గొర్రెలన్నింటినీ ఇప్పటికే అమ్మేసుకున్నారు. 70 శాతం వరకు ప్రస్తుతం లబ్ధిదారుల వద్ద లేవు. మరి రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న దాణాను పశు వైద్యాధికారులు ఎవరికి ఇస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. గొర్రెల పంపిణీ పథకంలో పశు వైద్యాధికారులే కీలకంగా వ్యవహరించి యూనిట్లను‘రీసైక్లింగ్‌’ చేశారు. మధ్య దళారులు పంపిణీ యూనిట్ల వద్ద బేరం చేసుకొని గొర్రెలను పంపిణీ చేశారు.ఇప్పుడు దాణాను కూడా వారే అక్రమంగా అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గొర్రెల కాపర్ల సహకార సంఘాల సభ్యులు డైరెక్టర్లతో కుమ్మక్కై దాణాను పక్కదారి పట్టిస్తున్నారు. నిజానికి ఒక్కో టన్ను దాణాకు ప్రభుత్వం రూ.16,700 ఖర్చు చేస్తోంది. యూనిట్‌కు 206,300కిలోలు చొప్పున ఒక్కో లబ్ధిదారుడిపై రూ.3,445 ప్రభుత్వం వెచ్చిస్తోంది. వనపర్తికి ప్రతిపాదించిన క్వింటాళ్లకు ప్రభుత్వం రూ.86 లక్షలు ఖర్చు చేస్తోంది. ఇందులో సుమారు రూ.50 లక్షల మేర అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని ప్రభుత్వం విచారణ చేపడితే కోట్లాది రూపాయల స్కాం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.ప్రభుత్వం ఇతర రాష్ర్టాల నుంచి కొనుగోలు చేసిన గొర్రెలు ఇక్కడి వాతావరణాన్ని తట్టుకోలేక జబ్బులు చేసి ఒక్కో యూనిట్‌లో సుమారు 5 వరకు మరణించాయి. అయితే పథకంలో భాగంగా యూనిట్‌లో ఉన్న గొర్రెలకు బీమా చేయాలి. చనిపోతే వాటికి తిరిగి సొమ్ము చెల్లించాలి. కానీ రాష్ట్రంలో ఎక్కడా బీమా సరిగా చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. బీమా చెల్లించాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే గొర్రెలు చనిపోయినా ఆ విషయాన్ని అధికారులు ధ్రువీకరించడం లేదు.వనపర్తి జిల్లాలో మొదటి విడతలో 1,92,507 గొర్రెలు పంపిణీ చేయగా వాటిలో 8,468 గొర్రెలకు మాత్రమే బీమా చేశారు. వేల సంఖ్యలో గొర్రెలు చనిపోయినా కేవలం 479 మాత్రమే చనిపోయినట్లు ధ్రువీకరించారు. వాటిలో కేవలం 246 గొర్రెలకే బీమా క్లెయిమ్‌ చేశారు.గొల్ల, కుర్మల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం 54లక్షల గొర్రెలను పంపిణీ చేసిందని, వాటికి 23 లక్షలు పిల్లలు పుట్టాయని మంత్రి తలసాని ఇటీవల మీడియాకు చెప్పారు. ప్రభుత్వం గొర్రెలను ఇవ్వడమే కాకుండా వాటి సంక్షేమానికి ఖరీదైన సీజనల్ వ్యాక్సిన్లు, దాణా, గడ్డి విత్తనాలు, 1962 సంచార వైద్యసేవలు ఉచితంగా అందిస్తున్నదని చెప్పారు. స్కీంకింద పంపిణీ చేసిన గొర్రెలకే కాకుండా, ఇతరవాటికి75శాతం సబ్సిడీతో దాణా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రాబోయేరోజుల్లో తెలంగాణ నుంచే మాంసం దేశంతోపాటు, ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతుందన్నారు. గొర్రెలు చనిపోతే ఇన్సూరెన్స్ సౌకర్యం ఉందని, పశువుల కాపరులకు ప్రమాదం జరిగితే 6 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఉన్నప్పటికీ అది సక్రమంగా అమలు కావడం లేదన్న విమర్శలు వస్తున్నవి. కాగా గొల్లకురమలనవనిర్మాణ సమితి తన కార్యకలాపాలను ముమ్మరంచేసింది. గతంలోఉండినఎస్.ఎన్.టిరిజర్వేషన్లను పునరుద్ధరించాలని ఈ సంఘం డిమాండ్ చేస్తోంది.కెసిఆర్ అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ పథకం పై ఆ కులానికి చెందిన ప్రొఫెసర్ కంచెఐలయ్య,ప్రొఫెసర్భీమవేని రాం షెఫర్డ్ తదితరులు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. అత్యంతవెనుకబడిన,సంచార జాతి అయిన గొల్ల కురమలను కేవలంఓటుబ్యాంకు గా చూస్తూ ఈ పధకాలను అమలు చేస్తున్నారని ప్రొఫెసర్ రాం షెఫర్డ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “ 20 గొర్రెలు ఒక కుటుంబం పోషణకు సరిపోవు. కనీసం కూలీ కూడా గిట్టదు.అర్హులైన వారంతా దరఖాస్తు పెట్టుకోవాలని ప్రభుత్వం కోరడంతో ఉన్నత విద్యావంతులైన నిరుద్యోగులు కూడా గొర్రెలు కాయడానికే సిద్ధపడుతున్నారు.తాను 4 వతరగతి లో ఉండగా గొర్రెలు కాశాను.ఇప్పుడు మళ్ళీ గొర్రెల కాపరి పని చేస్తున్నట్టు ఒక పి.హెచ్.డి.విద్యార్థిచెప్పాడు. నేనతన్ని ఫోన్ చేసి చీవాట్లుపెట్టాను.ఉస్మానియా యూనివర్సిటీలో పి.హెచ్.డి.ని మధ్యలో వదలొద్దు. భవిష్యత్తు నాశనం అవుతుందని నచ్చజేప్పాను. అతను తిరిగి హైదరాబాద్ వచ్చాడు. డబ్బులు లేకపోవడమే పేదరికం కాదు.సాంస్కృతిక పేదరికం అత్యంత ప్రమాదకరం. భూమిఇవ్వకుండా,శాశ్వత ఉపాధి చూపకుండా గొర్రెల యూనిట్లు ఇచ్చి గొల్ల కురమల జీవితాలను ఉద్ధరిస్తున్నట్టు ప్రచారం చేసుకోవడం బూటకం.ప్రభుత్వం నుంచి గొర్రెలు తీసుకొని మేపుకొంటున్న కాపరులపై పలు చోట్ల రెడ్డి కులస్తులు దాడులు చేస్తున్నారు. మీరు వెలమలకే ఓటు వేస్తారన్నది రెడ్ల అభియోగం. గొర్రెల పంపిణీ పధకం తర్వాత స్కూల్ డ్రాపౌట్ లు పెరిగాయి.పిల్లల్ని బడి మాన్పిస్తున్న సంఘటనలు ఉన్నాయి. వీటిపై సమగ్ర అధ్యయనం జరగాలి. గొల్లకురమల ను తక్కువ అంచనా వేయొద్దు. 5 వేల ఏండ్ల కిందటే గొల్ల కురమలు నెయ్యి తయారు చేశారు. గొడ్డలి తయారు చేశారు. గొంగడినేశారు.గొల్లకురమలలో చైతన్యం పొంగితే చెరువు తెగినట్టే . గొర్రెల మంద అనే చులకన భావన తగదు.ఆ మంద నేరుగా అసెంబ్లీ లోపలి వెళ్లిపోవచ్చు’’.అని ప్రొఫెసర్ రాం షెఫర్డు అన్నారు.