‘గొల్లభామ’ చీరలకు ప్రాచుర్యం.

హైదరాబాద్:
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట చేనేత కార్మికుల సమస్యల పై సచివాలయం లో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సమీక్ష.సమీక్ష సమావేశానికి హజరయిన ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ , భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, సోలిపేట రామలింగారెడ్డి.సిద్దిపేట దుబ్బాక నేతన్నల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను చర్చించిన మంత్రులు అధికారులు.సిద్దిపేట గొల్లభామ చీర కు మరింత ప్రాచుర్యం తీసుకువచ్చేందుకు రాష్ట్రంలోని అన్ని గోల్కొండ షోరూంలో వీటిని అందుబాటులో ఉంచుతామన్న మంత్రులు.నేతన్నల అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తోంది.నేతన్నకు చేయూత, చేనేత మిత్ర, మగ్గాల ఆధునికీకరణ, వంటి కార్యక్రమాలను నేతన్నల దగ్గరకు తీసుకుపోయేందుకు విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు ఆదేశం.
దుబ్బాక చేర్యాల సిద్దిపేటలోని సొసైటీల భవన నిర్మాణాలను పూర్తిచేసేందుకు టెక్స్ టైల్స్ డిపార్ట్ మెంట్ నిధులు అందిస్తుందన్న మంత్రి కేటీఆర్ .టెక్స్ టైల్స్ డిపార్ట్మెంట్ తరఫున ఇవ్వనున్న బతుకమ్మ చీరలు పరిశీలించిన మంత్రులు, ఉపసభాపతి.