ఘనంగా టీయుడబ్ల్యుజె ఇఫ్తార్.

Hyderabad:

మతసమరస్యానికి ప్రతీకగా, పవిత్ర రంజాన్ మాసంలో ప్రతిఏటా ఆనవాయితీగా, దాదాపు మూడు దశాబ్దాలుగా ఉర్దూ జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేస్తున్న ఇఫ్తార్ విందును తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె), హైదరాబాద్ జర్నలిస్ట్స్ యూనియన్( హెచ్ యు జె)లు సంయుక్తంగా శుక్రవారం నాడు నిర్వహించాయి. ఆబిడ్స్ లోని మీడియా ప్లస్ ఆడిటోరియం లో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 200మంది ఉర్దూ జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ మాట్లాడుతూ, సమాజానికి మాతసామరస్య సంకేతాలు అందించే లక్ష్యంతో ప్రతిఏటా తమ సంఘం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తమ ఆహ్వానాన్ని మన్నించి ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఉర్దూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఐజేయు కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, పిసిఐ మాజీ సభ్యులు కె.అమర్ నాథ్ లు మాట్లాడుతూ అడ్వాన్స్ గా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో పిసిఐ సభ్యులు ఎం.ఏ.మాజీద్, ఐజేయు కార్యవర్గ సభ్యులు కల్లూరి సత్యనారాయణ, టీయుడబ్ల్యుజె రాష్ట్ర కార్యదర్శి ఎం.ఏ.కె.ఫైసల్ అహ్మద్, కార్యవర్గ సభ్యులు ఎ.రాజేష్, తాహెర్ రుమాని, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కార్యదర్శి రాజమౌళి చారీ, హైదరాబాద్ జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు రియాజ్ అహ్మద్, శిగా శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.