చెడ్డి గ్యాంగ్ అరెస్ట్.

హైదరాబాద్:
గుజరాత్ కు రెండు ప్రత్యేక బృందాలను పంపించిన రాచకొండ కమిషనర్.రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్లతోపాటు తెలంగాణలోని వివిధ జిల్లాలు, ఏపీలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతూ.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన చడ్డీగ్యాంగ్‌
చెడ్డి గ్యాంగ్ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గుజరాత్‌ వెళ్లాయి. నలుగురిని పట్టుకున్నట్టు సమాచారం. ఇటీవల రాచకొండ, సైబరాబాద్‌ పరిధిలో అనేక దొంగతనాలకు యత్నించినట్లు ఈ ముఠాకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు పోలీసులకు లభించాయి. ప్రత్యేక పోలీసు బృందాలు వారికోసం వేట కొనసాగించాయి. చడ్డీ గ్యాంగ్‌ ముఠా గుజరాత్‌ రాష్ట్రంలో సంచరిస్తున్నట్లు రాచకొండ పోలీసులకు సమాచారం అందింది. రెండు ప్రత్యేక పోలీసు బృందాలు అక్కడికి వెళ్లాయి. ముఠాలోని నలుగురు వ్యక్తులు ఓ హోటల్‌లో ఉండగా పట్టుకున్నట్టు సమాచారం.