జకీర్ నాయక్ ను అప్పజెప్పేది లేదు.

కౌలాలంపూర్:
ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాడని, విద్వేష ప్రసంగాలు చేస్తున్నాడని వివాదాల్లో నిలిచిన ఇస్లాం మత ప్రబోధకుడు జకీర్ నాయక్ ను స్వదేశానికి పంపేది లేదని మలేసియా తెగేసి చెప్పింది. జకీర్ ను అప్పజెప్పాల్సిందిగా భారత ప్రభుత్వం మలేసియా ప్రభుత్వాన్ని కోరింది. దీనికి జవాబుగా అతడిని భారత్ కు అప్పగించబోమని మలేసియా ప్రధానమంత్రి మహాతిర్ మొహమద్ కుండబద్దలు కొట్టారు. మలేసియా శాశ్వత పౌరసత్వం పొందిన జకీర్ దేశంలో ఏ సమస్యా సృష్టించనంత కాలం అతడిని భారత్ కు పంపించేది లేదని స్పష్టం చేశారు. అయితే భారత దర్యాప్తు వర్గాలు మాత్రం జకీర్ నాయక్ ను స్వదేశానికి రప్పించే విషయంలో తమ ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయని చెబుతున్నాయి.