జమిలి ఎన్నికలకు కేసీఆర్ సై.

ఢిల్లీ
దేశ వ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలపై సిఎం కేసీఆర్ రాసిన లేఖ ను లా కమిషన్ కు అందించినట్టు టీఆర్ఎస్ ఎం.పి.వినోద్ ఆదివారం తెలిపారు.ఒకేసారి ఎన్నికలకు తాము మద్దతు తెలుపుతున్నామని అన్నారు.జమిలి ఎన్నికల పై చర్చ ఇప్పటిది కాదన్నారు.తొలిసారి 1983 లోనే దేశ వ్యాప్తంగా ఎన్నికలపై చర్చ మొదలైందన్నారు.మోడి ప్రభుత్వమో, బిజేపి నో ఈ చర్చ ను ప్రారంభించలేదని వినోద్ చెప్పారు.రాష్ట్రాల అభివృద్ధి, దేశ అభివృద్ధి నే లక్ష్యంగా కేసీఆర్ దేశ వ్యాప్తంగా ఎన్నికలకు మద్దతు తెలుపుతున్నారని ఎం.పి.వివరించారు.కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడగానే, రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలపైనే దృష్టి ఉంటుందన్నారు.మోడి అధికారంలోకి వచ్చాక కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రం లో ఎన్నికలు వస్తూనే ఉన్నాయని తెలిపారు.
దీంతో చాలా ధనం, సమయం వృధా అవుతుందన్నారు.2019 లోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి ఒకేసారి ఎన్నికలతో నష్టం ఏమి ఉండదన్నారు.
అయినా మిగతా రాష్ట్రాల కు జరుగుతున్న నష్టాన్ని దృష్టి లో పెట్టుకొని తమ అభిప్రాయాలను తెలిపామని ఎం.పి.చెప్పారు.
ముందుస్తు ఎన్నికలపై చర్చ అని కొందరు అర్థం లేని వాదనకు తెరలేపారన్నారు. ఒకేసారి దేశ వ్యాప్తంగా పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలపైనే చర్చ జరుగుతుందని వినోద్ తెలిపారు.