జయశంకర్ సార్ కెసిఆర్ కు పదమూడేళ్ల మందుగుండు

తన మేధోపరమైన మందుగుండు సామాగ్రినంతా ఏ ప్రతిఫలం ఆశించకుండా, నిస్వార్థంగా కేసీఆర్ ఫిరంగి లో కూర్చారు. జయశంకర్ సార్ని ష్కపటి. నిస్వార్థపరుడు. ప్రజల మేధావి. ఎన్ని తుపానులు వచ్చినా2001 నుంచి కేసీఆర్ తన రెండో ఇన్నింగ్స్ లో ఎత్తిన తెలంగాణ జెండానుకిందకు దించకుండా 13 సంవత్సరాల పాటు పోరాటం సాగించడం వెనుక జయశంకర్ సార్ సహకారం, ప్రోత్సాహం ఉన్నవి. కెసిఆర్డీలా పడినప్పుడు జయశంకర్ సార్ కలిగించిన ధైర్యం, ఇచ్చిన ఆత్మ స్థయిర్యం పుష్కలంగా ఉన్నవి. తెలంగాణకు చెందిన అత్యంత ప్రభావశీలమైన వ్యక్తులలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ నిస్సందేహంగా ఒకరు. ఆయన అధ్యాపకుడు. నిరంతర అధ్యయన శీలి. కార్యకర్త. నిరాడంబరుడు. తన పరిధులు, పరిమితుల పట్ల సంపూర్ణ అవగాహన ఉన్నవాడు. చివరి శ్వాస వరకు తెలంగాణను తపించి, జపించి, తలపోసిన,కలగన్నవాడు. తెలంగాణచూడకుండానే కన్ను మూసిన వాడు.

ఎస్.కె.జకీర్.
తెలంగాణ రాకతప్పదు. ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్ గా సొసైటీ మొత్తం వర్టికల్ గ డివైడ్ అయింది. ఈ దశ నా యాభై, అరవైఏండ్ల అనుభవంలో కూడా లేకుండే. ఇపుడు చాల తృప్తికరమైన స్టేజికివచ్చింది. తిరుగులేని స్టేజికి వచ్చినం. వెనక్కిబోదు. గతంలోవెనక్కిబోయింది. ఇపుడు వెనక్కిబోయే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది కేవలం పార్టీలకు, వ్యక్తులకు పరిమితమై లేదు. ఈ రోజు ప్రజల్లోకి బలంగా పోయింది. మా కోరిక కూడా అదే.ఇది సిసలైన ప్రజా ఉద్యమం.ప్రజలఇన్వాల్వ్ మెంట్ లేకుండా మొన్న ఆ ఎలక్షన్స్ లో రిజల్ట్స్వస్తాయా.టిఆర్ఎస్ మీద కోపం ఉండే.కెసిఆర్ మీద కోపం ఉండే. అయినా గానీ ఆ గెలుపు అపోజిషన్ పార్టీల వాండ్లు అంత డబ్బు ఖర్చు పెట్టినా వచ్చిందంటే సామాన్యమైనది గాడు. ప్రజల్లోకిబోయింది. మా జీవితాశయం గూడా అదే. ప్రజల్లోకిబోవాలె. దీన్ని ఇక ఎవరూ ఆపలేరు. తెలంగాణను తప్పకుండ జూస్త. నాకైతే సందేహం లేదు. తర్వాతతెలంగాణ పునర్నిర్మాణం అన్నది మేజర్ ఎజండా. తెలంగాణ దేని కొరకు. ఎవరికొరకు. బిసి సమస్య వస్తది. తెలంగాణఆర్థికాభివృద్ధి మోడల్ ఎట్ల ఉండాలె అన్నప్పుడు…అగ్రికల్చరల్ఎట్ల ఉండాలె, ఇరిగేషన్ఎట్ల ఉండాలె అనే ప్రణాళిక ఉన్నది. ఇపుడు జెప్పడం గొంతెమ్మ కోరిక లాంటిది. విద్యావిధానం, వైద్య విధానం ఎట్ల ఉండాలో ప్రణాళిక చేసుకోవాలె. ఆంధ్రప్రదేశ్ లో సామాజిక న్యాయం లేదు తెలంగాణ విడిపోతే సామాజిక న్యాయం లభిస్తది. అరవైఏండ్ల చరిత్రలో బలహీనవర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం రాలే. కాంగ్రెస్ పార్టీ అంటే మల్ల గదే రాజశేఖరరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి కొడుకులా? లేకపోతేపురందేశ్వరా? జైపాల్ రెడ్డా? గీల్లెకదా!టిడిపి అంటే సింగిల్. కమ్యూనిష్టులు తక్కువ తిన్నరా?మల్లగవేకులాలుగదా? బిజెపి గదే గదా? ఏవైతే రెండు వర్గాలు మాత్రమేఉన్నయి. రెడ్డి,కమ్మ వాల్ల చేతుల నుంచి బయటికి రాదు. తెలంగాణ, రాయలసీమ రెడ్లు కలిస్తే పెద్ద ఫర్మిడబుల్ ఫోర్స్అది. కమ్మాస్ఎమర్జ్అయిపోయిండ్రు. విడిపోతే ముందు కమ్మ ఫ్యాక్టర్ పోతది. తెలంగాణలో కమ్మ ఫ్యాక్టర్ ఉండదు. తెలంగాణ, రాయలసీమ రెడ్లు వీక్. ఇప్పటికీ పదిరికుప్పం, వేంపెంటలు, కారంచేడు సంఘటనలు జరుగుతునే ఉన్నయి. తెలంగాణలోకావు. అవకాశంలేదు. ఇక్కడ బలహీనవర్గాలలో చైతన్య స్థాయి పెరిగింది. ఇది ఒక్క రోజులో జరిగినదికాదు. 50,60 ఏండ్ల ఉద్యమాల ఫలితం ఇది. రాష్ట్రాన్నికాపాడేది కూడా ఆ చైతన్యమే.వ్యక్తులుగాదు. తెలంగాణలో సామాజిక న్యాయం సాధ్యమైతది. రాష్ట్ర ప్రభుత్వం ద్యేయమైనప్పుడే అదిఅయితది. ఎకనమిక్, డెవలప్ మెంట్ పాలసీస్అట్లాఉండాలె.’’అని ప్రొఫెసర్ జయశంకర్ సార తన చివరి రోజుల్లో అన్నారు. ‘ఒడువనిముచ్చట’లో ఈ అంశాలు ఉన్నాయి.
ఇప్పుడు జయశంకర్ సారు లేరు కానీ ఆయన కలలుగన్న స్వరాష్ట్రం ఉన్నది. ఎస్.సి, ఎస్.టి., బి.సి, మైనారిటీ లందరికి రాజకీయ అధికారంలో, అభివృద్ధిలో వాటా ఇవ్వాలని ఆయన గట్టిగా కోరుకున్నారు. ఆ దిశగా కేసీఆర్ అడుగులు పడుతున్నాయో, లేదో జయశంకర్ సారుఅభిమానులు, మద్దతుదారులు, పక్కా తెలంగాణ వాదులు విశ్లేషించుకోవలసి ఉన్నది. సామాజిక న్యాయం విషయంలో కెసిఆర్ ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవలసిఉన్నది. జయశంకర్2001 కి ముందు వున్నారు. తాను తొలిదశ తెలంగాణ విముక్తి పోరాటాలలో పాల్గొన్నా, 1996 నుంచి జరిగిన కొన్ని కీలక మలిదశ పోరాటాల ప్రారంభ ,సన్నాహక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నా… కేసీఆర్ తెలంగాణ మాండలిక మాటల మాంత్రికత్వం ఆయనను టీఆరెస్ కు కట్టిపడేసింది. ‘గో బ్యాక్’లు, ఇతర హింసాత్మక ఉద్యమాలు కాకుండా కేసీఆర్ అనుసరించిన వ్యూహాలు, రాజీ లేని శాంతియుత పంథా పట్ల జయశంకర్ సార్ కు గురి కుదిరింది. అందుకే ఆయన కేసీఆర్ ను తుది వరకు అంటిపెట్టుకుని ఉన్నారు. తన మేధోపరమైన మందుగుండు సామాగ్రినంతా ఏ ప్రతిఫలం ఆశించకుండా, నిస్వార్థంగా కేసీఆర్ ఫిరంగి లో కూర్చారు. జయశంకర్ సార్ నిష్కపటి. నిస్వార్థపరుడు. ప్రజల మేధావి. ఎన్ని తుపానులు వచ్చినా 2001 నుంచి కేసీఆర్ తన రెండో ఇన్నింగ్స్ లో ఎత్తిన తెలంగాణ జెండానుకిందకు దించకుండా 13 సంవత్సరాల పాటు పోరాటం సాగించడం వెనుక జయశంకర్ సార్ సహకారం, ప్రోత్సాహం ఉన్నవి. కెసిఆర్డీలా పడినప్పుడు జయశంకర్ సార్ కలిగించిన ధైర్యం, ఇచ్చిన ఆత్మ స్థయిర్యం పుష్కలంగా ఉన్నవి.
తెలంగాణకు చెందిన అత్యంత ప్రభావశీలమైన వ్యక్తులలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ నిస్సందేహంగా ఒకరు.ఆయన అధ్యాపకుడు. నిరంతర అధ్యయన శీలి. కార్యకర్త. నిరాడంబరుడు. తన పరిధులు, పరిమితుల పట్ల సంపూర్ణ అవగాహన ఉన్నవాడు. చివరి శ్వాస వరకు తెలంగాణను తపించి, జపించి, తలపోసిన,కలగన్నవాడు. తెలంగాణచూడకుండానే కన్ను మూసిన వాడు. మామూలుగా చాలామందికి ఏదైనా లక్ష్యం ఉన్నా అది జీవితమంతా ఉండకపోవచ్చు ను. కానీ జయశంకర్ సార్ తన జీవితకాలం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లక్ష్యాన్ని ఖరారు చేసుకున్నారు. అందుకే ఆయనకు సార్వజనీనత ఉంటుంది. ఆయన పట్ల విశ్వసనీయత ఉంటుంది. అందరికి ఆమోదయోగ్యమైన విధంగా ఉండగలగడం జయశంకర్ సార్ కే సాధ్యమైంది. ఆయన పెట్టుకున్న లక్ష్యం,దాన్ని సాధించేందుకు పడ్డ కష్టం ఆయనను శిఖర స్ధాయికితీసుకు వెళ్ళినవి. జయశంకర్ సార్ బలమూ, బలహీనతా తెలంగాణే. ఈ కారణంగానే టిఆర్ ఎస్ నిర్మాత కేసీఆర్ తోఎప్పుడైనావిబేధం వచ్చినా అది బయట పడనిచ్చే వారు కాదు. అసలా విషయాలను ఆయన ఎవరితోనూ పంచుకోలేదు కూడా. అదీకమిట్ మెంటు. అదీ నికార్సు తెలంగాణ వాది లక్షణం. 1952లో నాన్‌-ముల్కీ గో బ్యాక్‌ ఉద్యమం నుంచి 2010-11లో తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆందోళన వరకు, ఫజల్‌ అలీ ఆధ్వర్యంలోని రాష్ట్రాల పునర్విభజన కమిషన్‌ (1954) నుంచి శ్రీకృష్ణ కమిటీ (2010) వరకు, ఇందిరాగాంధీ నుంచి సోనియా గాంధీ వరకు, కొండా వెంకటరంగారెడ్డి నుంచి కె.సి.ఆర్‌. వరకు అన్ని ఉద్యమాల్లో చురుగ్గా పనిచేస్తూ, నివేదికలిస్తూ, వాదనలు వినిపిస్తూ, నేతలకు సలహాలిస్తూ, ఎప్పటికప్పుడు ఉద్యమదిశను నిర్దేశిస్తూ మార్గదర్శిగా నిలిచారు జయశంకర్‌. చనిపోయేనాటికి జయశంకర్‌ స్వంత ఆస్తి, పాత మారుతీ (800) కారు, కొన్ని పుస్తకాలు మాత్రమే. చివరి రోజుల్లో హైదరాబాద్‌లోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీలో చేరినప్పుడు గవర్నర్‌ నరసింహన్‌ వచ్చి ‘‘మీ వైద్యానికి ఎంత ఖర్చయినా ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉంది. విదేశాలకు పంపి మెరుగైన చికిత్స చేయిస్తాను”. దయచేసి ఒప్పుకోండనిబ్రతిమిలాడినా జయశంకర్‌ ‘నో థ్యాంక్స్‌’ అంటూ సున్నితంగా తిరస్కరించారు. మరణంతథ్యమనుకున్న జయశంకర్‌, చికిత్సను వెంటనే ఆపేసి హన్మకొండకు పంపించమని కోరారు. డిశ్చార్జి రోజు ఆఖరిసారి జయశంకర్‌ను చూడటానికి వచ్చిన కె.సి.ఆర్‌. హెలికాప్టర్‌లో హన్మకొండకు పంపిస్తానంటే కూడా వద్దన్నారు. హాస్పిటల్‌ సమకూర్చిన అంబులెన్స్‌లోనే బ్రహ్మంతో పాటు వెళ్ళిపోయారు.
1996 నవంబర్‌ ఒకటిన వరంగల్‌లో భూపతి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ‘తెంగాణ విద్రోహ దినం’ సభలో జయశంకర్‌, కాళోజీ, జస్టిస్‌ కొండా మాధవరెడ్డి ప్రసంగించారు. రెండు వందలమందివస్తారనుకున్న సభకు సుమారు నాలుగైదువేలమంది వచ్చారు. నేను అప్పుడు ‘వార్త’ వరంగల్ బ్యూరో చీఫ్ గా వరంగల్, ఖమ్మం, కరీం నగర్, ఆదిలాబాద్ జిల్లాల రిపోర్టింగ్ వ్యవహారాలూ పర్యవేక్షిస్తున్నా. టి ఆర్ ఎస్ లో ఏ బాధ్యతలు తీసుకోని జయశంకర్‌ దశాబ్దకాలం పాటు ఆ పార్టీ నిర్వహించిన దాదాపు అన్ని సభల్లోనూ కె.సి.ఆర్‌. వెంటే ఉన్నారు. ప్రజలను చైతన్యపరిచే ప్రసంగాలు చేశారు.
2004 ఎన్నికల అనంతరం కె.సి.ఆర్‌, నరేంద్రలు ఢిల్లీలో కేంద్ర మంత్రులుగా పనిచేసిన కాలమంతా జయశంకర్‌ వారితోనే ఉన్నారు. జయశంకర్‌ సేవలను ఉపయోగించుకోవాలనుకున్న ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వాలనుకున్నారు. సిపిఎం ఆ సీటు తమకు కావాలనడంతో, ప్రణాళిక సంఘం సభ్యునిగా నియమించాలని భావించారు. ఈ విషయం తెలిసి అప్పటి సీఎం రాజశేఖర రెడ్డి జయశంకర్‌ను ప్లానింగ్‌ కమీషన్‌ మెంబర్‌ కాకుండా అడ్డుపడ్డారు. చివరకు ప్రధాని అధ్యక్షతన వున్న ‘నేషనల్‌ కమీషన్‌ ఫర్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ ఇన్‌ అనార్గనైజ్డ్‌ సెక్టార్‌’లో మొదటి సభ్యునిగా నియమించారు. ‘నా తెలంగాణ యాక్టివిటీకిఅడ్డువస్తే ఈ పదవి నాకక్కర్లేద’ని జయశంకర్‌ మన్మోహన్‌సింగ్‌కి స్పష్టం చేశారు.2009 నవంబర్‌ 29న కె.సి.ఆర్‌.ను కరీంనగర్‌లో పోలీసులు అరెస్టు చేసినపుడు జయశంకర్‌ను ఆయన కారులోనుంచిదించేశారు. ఆ తర్వాత నిమ్స్‌లోకె.సి.ఆర్‌. ఆమరణదీక్ష చేసిన రోజుల్లో జయశంకర్‌ నిమ్స్ లోనే ఎక్కువ సమయం వెచ్చించారు. డిసెంబర్‌ 9 నాటి చిదంబరం తెలంగాణ ప్రకటన రూపకర్త జయశంకర్‌సారే. చిదంబరం ప్రకటన వెలువడిన వెంటనే ఫ్రూట్‌ జ్యూస్‌ను తన చేత్తో ఇచ్చి కె.సి.ఆర్‌. దీక్షను జయశంకర్‌ స్వయంగా విరమింపజేశారు.
కె.సి.ఆర్‌.తో కలిసి కాంగ్రెస్‌ నేత జానారెడ్డి ఇంటికి పోయి తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీని ఏర్పాటు చేయడంలో ముఖ్య భూమికను పోషించారు జయశంకర్‌. కోదండరాంను జె ఏ సి ఛైర్మన్ గా చేసింది జయశంకర్ సారే. “తెలంగాణ తేవడం పదిశాతం పనైతే వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణగా మలుచుకోవడం తొంబయి శాతం పని’’ అని నా లాంటి జర్నలిస్ట్ లు కలిసినప్పుడు జయశంకర్ సార్ పలు సందర్భాల్లో చెబుతుండేవారు. కె.సి.ఆర్‌.నాలుగేళ్ల పాలన మంచిచెడులు ప్రజలే సమీక్షించుకోవలసిఉంటుంది.