జర్నలిస్టుల గర్జన సక్సెస్.

హైదరాబాద్;
తెలంగాణ స్టేట్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల గర్జన సభ అట్టహాసంగా జరిగింది.బాగ్ లింగంపల్లి లోని RTC కల్యాణ మండపంలో జరిగిన గర్జన సభకు రాష్ట్రంలోని 31జిల్లాల నుండి వేల సంఖ్యలో జర్నలిస్టులు, జిల్లా యూనియన్ అధ్యక్షులు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు SN సిన్హా, దేవులపల్లి అమర్, శ్రీనివాస్ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డి, విరాత్ అలీ, శేఖర్, తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంపత్, porf కోదండరామ్, వైస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, ఇతర పార్టీ నాయకులు, యూనియన్ లీడర్లు పాల్గొన్నారు.239 GO రావడం వలన ఉర్దూ, వెబ్ మీడియా లకే కాకుండా ఇతర పెద్ద మీడియా వాళ్లకు కూడా నష్టం జరుగుతోందని tuwj రాష్ట్ర కార్యదర్శి విరాహత్ అలీ అన్నారు.ఈ 239 GO ప్రకారం ఒక మీడియా కు ఒక అక్రిడేషన్ అని పేర్కొంది. దీని వలన రూరల్ ఏరియా లో పని చేస్తున్న జర్నలిస్టులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా లేని విధంగా అక్రెడిషన్ లలో ఇబ్బందులు, అవకతవకలు తెలంగాణా లో జరుగుతున్నాయన్నారు.రాష్ట్రంలో ఒక్క అక్రెడిషన్ లు మాత్రమే కాదు, హెల్త్ కార్డులు, ఇల్లు, ఇళ్ల స్థలాల అంశాలు కూడా సమస్యలుగా ఉన్నాయి.ఇల్లు, ఇళ్ల స్థలాల అంశం కోర్ట్ లో ఉంది అన్నప్పుడు, సీఎం కేసీఆర్ వరంగల్ సభ.. ప్రగతి భవన్ లలో ఎందుకు హామీ ఇచ్చారు అని విరత్ ప్రశ్నించారు.60 సంవత్సరాల పోరాట ప్రతిభ కలిగిన సంస్థ తెలంగాణా స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అన్్నరు. 19 వేల మందికి అక్రిడేషన్స్ వస్తే…12 వేల మంది జర్నలిస్ట్ లకు కార్డులు ఇంకా రాలేదు.ఈ 19 వేల మందిలో 8 వేల మందికి మాత్రమే హెల్త్ కార్డులు వచ్చాయి. ఇంకా 11 వేల మందికి హెల్త్ కార్డులు రాలేదు.

SN సిన్హా – అల్ ఇండియా అధ్యక్షులు:
ఈ జర్నలిస్ట్ గర్జన కు పెద్ద ఎత్తున జర్నలిస్టులు తరలివచ్చారు అంటే సమస్య ఎంత తీవ్రంగా వుందో అర్థం అవుతోంది.ఇది రాష్ట్ర సమస్యగా పరిగణించడానికి లేదు. దేశ సమస్యగా పరిగణించాల్సిన ఆవశ్యకత వచ్చింది అని సిన్హా పేర్కొన్నారు.ప్రజా సమస్యలను, కష్టాలను ఒక జర్నలిస్ట్ మాత్రమే వినిపిస్తాడు. ప్రజా సమస్యలను తన సమస్యలుగా భావిస్తాడు. అలాంటి జర్నలిస్ట్ లకు ఇప్పుడు సమస్య వచ్చి పడింది. కేంద్ర ప్రభుత్వం కు అనేక పర్యాయములు వేజ్ బోర్డ్ అంశంపై, జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రం ఇచ్చాము. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం జర్నలిస్టుల సమస్యలపై స్పందించాలని సిన్హా డిమాండ్ చేశారు.

శ్రీనివాస్ రెడ్డి:
తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డక ముందు ఉన్న ప్రభుత్వాలు జర్నలిస్ట్ భీమా పథకాన్ని అమలు చేయడానికి అడ్డంకులు ఏమి లేవని చెప్పాయి.
తెలంగాణా ఏర్పడ్డకా జర్నలిస్ట్ బీమా పథకం కోసం యూనియన్ తరపున కోటి రూపాయలు ఫండ్ ఇచ్చామని కూడా ప్రస్తుత ప్రభుత్వానికి వివరించాము. కానీ సీఎం కేసీఆర్ అప్పుడున్న పరిస్థితుల్లో అధికార వ్యవస్థ ఇంకా ఒక గాడికి రాలేదని చెప్పారు. సరే అని 4 సంవత్సరాలు ఎదురు చూసాము.ఈ నాలుగేళ్లలో చాలా మంది జర్నలిస్టులు చనిపోయారు. ఈ భీమా పథకం ఉంటే ఎంతో మంది జర్నలిస్టులకు ఉపయోగకరంగా వుండేది.ప్రభుత్వ కొమ్ము కాసే యూనియన్ లు చేసే తప్పుడు సమాచారాలు, ప్రచారాలకు జర్నలిస్ట్ లు మోసపోతున్నారు.
అందరూ జర్నలిస్టులు, డెస్క్ ఎంప్లాయిస్ లకు అక్రిడేషన్లు, హెల్త్ కార్డ్ లు పూర్తిగా అందరికీ వచ్చాయా అంటే సమాధానం లేదు.

జర్నలిస్టుల కోసం గత ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ పథకాలను కూడా వర్తించేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ను కోరాము. అయినా సీఎం ఈ విషయం పై స్పందించడం లేదు.అక్రిడేషన్, సాచిరేషన్ అంశాలు పెద్ద సమస్యగా ఉన్నాయి. రెండు కాదు…మూడు గదుల ఇల్లు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. కానీ ఇంత వరకు అమలు కాలేదు.చిన్న పత్రికల సమస్యలు, ఇబ్బందులు సీఎం గారికి పట్టవా అని శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు.ఇప్పటికైనా ప్రభుత్వం జరలిస్టులు సమస్యలపై స్పందించక పోతే…మరో పెద్ద ఉద్యమానికి పూనుకుంటామని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.