జియో తరహాలో మరో సంచలనం.. ఏడాదిపాటు అన్ని చానళ్లూ ఫ్రీ ఫ్రీ ఫ్రీ

న్యూ ఢిల్లీ;
కేబుల్ నెట్ వర్క్స్ అప్రేటర్స్ పెద్ద షాక్ ఇవ్వునున్న అనిల్ అంబానీ.సోదరుడు ముకేశ్ అంబానీకి తాను ఏమాత్రం తీసిపోనని నిరూపించేందుకు ఆయన సోదరుడు అనిల్ అంబానీ సిద్దమయ్యారు. టెలికం రంగంలో జియో సంచలనం సృష్టించినట్టుగానే, డీటీహెచ్ సేవల్లో ప్రకంపనలు సృష్టించేందుకు అనిల్ రంగం సిద్దం చేశారు. అందులో భాగంగా రిలయన్స్ బిగ్ టీవీ నుంచి బ్రహ్మాండమైన ఉచిత ఆఫర్‌ను ప్రకటించారు. కేవలం రూ.500 చెల్లించి హెచ్‌డీ హెచ్‌ఈవీసీ సెట్‌ టాప్ బాక్స్‌లను పోస్టు ఆఫీసుల నుంచి పొందవచ్చు. వీటిని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఏడాదిపాటు ఉచితంగా హెచ్‌డీ చానళ్లను అందిస్తారు. అలాగే ఐదేళ్ల వరకు 500 ఫ్రీ టు ఎయిర్ చానళ్లను ఉచితంగా వీక్షించవచ్చు.త్వరలోనే సెట్‌బాక్స్‌ల ఇన్‌స్టాలేషన్‌ను ప్రారంభించనున్నారు. సెట్ టాప్ బాక్స్‌ల డెలివరీ ఈనెల 15 నుంచి ప్రారంభం అవుతుంది. ముందస్తు బుకింగ్ చేయించుకున్న వినియోగదారులు జూలై 30లోపు తమ సెట్ టాప్ బాక్స్‌లను బిగించుకోవాల్సి ఉంటుంది. జూన్ 20 నుంచి పోస్టాఫీసుల్లో ముందస్తు బుకింగులు ప్రారంభం కానున్నట్టు బిగ్ టీవీ తెలిపింది.రాజస్థాన్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం తదితర రాష్ట్రాల్లోని 50 వేల పోస్టాఫీసులతో రిలయన్స్ బిగ్‌టీవీ ఒప్పందం కుదుర్చుకుంది.హెచ్‌డీ హెచ్‌ఈవీసీ సెట్ టాప్ బాక్స్ పూర్తిగా లేటెస్ట్ ఫీచర్లతో రానుంది. షెడ్యూల్డ్ రికార్డింగ్, యూఎస్‌బీ పోర్టు, హెడీఎంఐ పోర్టు, రికార్డింగ్ తదితర ఫీచర్లు ఉండనున్నాయి.

సెట్ టాప్ బాక్స్ అసలు ధర రూ.2 వేలు. వినియోగదారులు తొలుత రూ.500 చెల్లించి పోస్టాఫీసులలో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

డెలివరీ సమయంలో మిగతా రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది.ఉచిత సేవలు ముగిసి రెండో ఏడాదిలోకి ప్రవేశించిన తర్వాత వినియోగదారులు రూ.300తో నెలవారీ రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రెండేళ్లు చేయించుకున్న తర్వాత తొలుత చెల్లించిన రూ.2వేలు వెనక్కి ఇచ్చేస్తుంది.సెట్ టాప్ బుకింగ్ తర్వాత 30-45 రోజుల్లో బాక్స్ డెలివరీ అవుతుంది