జీతాలు లేక ‘స్టూడియో ఎన్ ‘ సిబ్బంది సమ్మె.

హైదరాబాద్:
5 నెలలుగా జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్న యాజమాన్యపు ధోరణికి వ్యతిరేకంగా తక్షణం 5 నెలల వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగిన స్టూడియో ఎన్ ఉద్యోగులకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ మద్దతు ప్రకటిస్తున్నది. యాజమాన్యం దిగి వచ్చే వరకు స్టూడియో ఎన్ ఉద్యోగులకు TUWJ, TEMJU అండగా నిలబడుతుంది. వాళ్ళు నిర్వహించే అన్ని రకాల పోరాటాల్లో TUWJ, TEMJU పాల్గొంటుంది. నాయకత్వం వహిస్తుంది. స్టూడియో యాజమాన్యం తక్షణం ఉద్యోగుల వేతన బకాయిలు చెల్లించాలనిTUWJ అధ్యక్షుడు అల్లం నారాయణ‌,ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్ TEMJU అధ్యక్షుడు ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి రమణకుమార్ డిమాండ్ చేశారు.