జూరాల ప్రాజెక్టు వద్ద ఉద్యానవనం.

హైదరాబాద్:
జూరాల ప్రాజెక్టు వద్ద ఉద్యానవనం నిర్మించనున్నారు. ఈ ఉద్యానవనం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి రూ.15కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జూరాల ప్రాజెక్టు వద్ద పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు.