జూలై 12 న అమిత్ షా రాక.

  • తెలంగాణలో రేపు బీజేపీ జన చైతన్య యాత్రకు శ్రీకారం.

హైదరాబాద్:
జన చైతన్య యాత్ర తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఈ ప్రభుత్వం పై యుద్ధం ప్రకటించి, ప్రజల ముందు కాంగ్రెస్ ను, టీఆర్ఎస్ ను దోషిగా నిలబెడతామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా టీఆర్ఎస్ బీజేపీ రహస్య ఒప్పందం జరిగిందన విషప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కర్ణాటక లో వీరు తీరు బట్టబయలు అయిందన్నారు. ప్రాంతీయ పార్టీలతో కలిసి కాంగ్రెస్ ముఠాగా ఏర్పడి బీజేపీ ని, మోడీ ని దూషిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండు మజ్లిస్ కు అంటకాగిన పార్టీలేనన్నారు.తాము ఎవరితో రహస్య ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
కాంగ్రెస్, టీఆర్ఎస్ కు ప్రజా క్షేత్రం లో బుద్ది చెపుతామని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కుటుంబ పాలన గా మార్చిందన్నారు.
బీసీ లను ,కాంగ్రెస్ , టీఆర్ఎస్ మోసం చేసిందన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ లు రెండు కూడా ఎస్సి,ఎస్టీలకు ద్రోహం చేసాయని ఆరోపించారు. ఎస్సి వర్గీకరణ విషయం లో ఇప్పటి వరకు ఎందుకు అఖిలపక్షం ను ఢిల్లీ తీసుకెల్లలేదని ప్రశ్నించారు. బీసీ,ఎస్సి,ఎస్టీలను కేవలం ఓటు బ్యాంకు గానే చూస్తున్నారని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎస్సి వర్గీకరణ చేయలేదు.. కానీ ఇప్పుడు అధికారం ఇస్తే వర్గీకరణ చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.కాంగ్రెస్, టీఆర్ఎస్ మోసపూరిత చర్యలను ప్రజల ముందు ఎండగడతామని లక్ష్మణ్ తెలిపారు.పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను ఖర్చు చేయకుండా తాత్సార్యం చేస్తుందన్నారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ లో కూడా అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ యాత్రలు ఢిల్లీ యాత్రలకు పరిమితం అయ్యాయని విమర్శించారు. రేపు బషీర్బాగ్ అమ్మవారి సన్నిధానం లో పూజల అనంతరం యాత్ర ప్రారంభించనున్నట్టు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు తెలిపారు.