జైలు నుంచి హెలికాఫ్టర్ లో గజదొంగ పరారీ!

పారిస్:
పారిస్‌కు చెందిన ఫెయిద్ రెడోయిన్ (46) అనే గజదొంగ, అతని అనుచరులు ఓ హెలికాఫ్టర్‌ సాయంతో జైలు నుంచి తప్పించుకున్న ఉదంతం పారిస్ లో కలకలం రేపుతున్నది.
పారిస్‌లో పెద్ద గజదొంగగా పేరు మోసిన రెడోయిన్కు కోర్టు 25 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. కానీ జైలు గోడల్ని డైనమైట్‌తో బద్దలు కొట్టి తప్పించుకున్నాడు. మళ్లీ పోలీసులు 6 వారాల్లో పట్టుకొని జైలులో వేశారు. అతని బాల్యమంతా నేరాలతోనే గడిచింది. వయసు పెరిగిన కొద్దీ పెద్ద పెద్ద నేరాలు చేస్తున్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. పోలీసులకు, ఫెయిద్‌ కు మధ్య గతంలో కాల్పులు జరిగిన ఘటనలో ఓ మహిళా పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయింది. హెలికాఫ్టర్‌ సహాయంతో జైలు నుంచి పారిపోయినా గజదొంగ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.