టాలీవుడ్ సీనియర్ నటుడు వినోద్ కన్నుమూత.. విషాదం లో సినీ పరిశ్రమ తెలుగు చిత్ర పరిశ్రమ

ఇంద్ర, చంటి , నరసింహ నాయుడు, లారీ డ్రైవర్, మిర్చి, తదితర సినిమాలో నటించి మెప్పించిన సీనియర్ నటుడు వినోదే తెల్లవారుజామున కన్నుమూశారు. 300 ల కు పైగా సినిమాల్లో నటించిన ఆయన తెల్లవారుజామున రెండు గంటల సమయములో బ్రెయిన్ స్ట్రోక్ తో ఆయన నివాసం లో తుది శ్వాస విడిచారు, విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిరపరిచితుడైన వినోద్ పలు సీరియల్ లోను నటించారు. బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు . వినోద్ అసలు పేరు అరిశెట్టి నాగేశ్వర రావు , ఫ్యాక్షన్ సినిమాల్లో విలన్ గా నటించి పేరు తెచ్చుకున్నఆయన మృతి విషయం తెలిసి చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతి గురిఅయింది