టిఆర్ఎస్ లో అంతర్గత పోరు. ఎంపి వర్సెస్ ఎం ఎల్ఎ లు . కేసీఆర్ కు ఫిర్యాదు.

పార్టీ పరిస్థితి రోజు రోజుకు క్షిణిస్తోంది. జిల్లాలో ఎంపి ఎంఎల్ఎ లు, మంత్రి మద్య గ్యాప్ పెరిగిపోతున్నది. తెలంగాణ ఉద్యమానికి సంబందం లేకపోయినా జిల్లాలో పార్టీ విస్తరించింది. గత ఎన్నికల్లో ఒకే ఒక్క చోట కొత్త గూడెం లో మాత్రమే పార్టీ అబ్యర్ధిగా జలగం వెంకట్రావు గెలుపొందాడు. మిగిలిన చోట్ల మాత్రం పార్టీకి డిపాజిట్ లకు దరిదాపుల్లోకి రాలేదు. అటు టిడిపి, ఇటు వైసిపి లకు చెందిన నాయకులూ తుమ్మల నాగేశ్వరరావు, ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పార్టీలో చేరారు. తుమ్మల వెంట టిడిపి, పొంగులేటి వెంట వైసిపి చేరడంతో జిల్లాలో ‘గులాబీ రేకులు’ విస్తరించాయి. పార్టీ బలపడింది. పార్టీ బయటకుచూడడానికి బలపడింది కానీ, అది ‘కలకూర గంప’ మాదిరిగా ఉంది. టి డిపి నుంచి తుమ్మల నాగేశ్వర రావు, కాంగ్రెస్ నుంచి కోరం కనకయ్య, వైసిపి నుంచి ఎంపి పొంగులేటి, ఎంఎల్ ఎ లు మదన్ లాల్, తాటివెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు చేరారు. వారి వెంట క్యాడర్ కూడ వచ్చి చేరింది. అయితే ఇలా చేరిన పార్టీ నాయకుల్లో సఖ్యత లేదు. సమన్వయము లేదు.

ఖమ్మంలో ‘గులాబీ ముళ్ళు’. 

ఖమ్మం.
ఖమ్మం జిల్లాలో అధికారపార్టీలో అంతర్గత పోరాటం ఊపందుకున్నది. ఒక్క ‘గులాబీ రేకు’కు మరో ‘రేకు’ కు సంబందం లేకుండా వ్యవహరిస్తున్నాయి. అంతర్గత కలహాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. వర్గ విబేదాలతో పార్టీ రోడ్డెక్కుతున్న పరిస్థితి నెలకొంది. చివరకు ఎంపిని ఎవ్వరు తమ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదు. జరుగుతున్న వ్యవహారాలపై అధిష్టానానికి పిర్యాదు చేస్తున్నప్పటికి అదిష్టానం కూడ చొరవ చూపించడం లేదు. పలితంగా పార్టీ పరిస్థితి రోజు రోజుకు క్షిణిస్తోంది. జిల్లాలో ఎంపి ఎంఎల్ఎ లు, మంత్రి మద్య గ్యాప్ పెరిగిపోతున్నది. తెలంగాణ ఉద్యమానికి సంబందం లేకపోయినా జిల్లాలో పార్టీ విస్తరించింది. గత ఎన్నికల్లో ఒకే ఒక్క చోట కొత్త గూడెం లో మాత్రమే పార్టీ అబ్యర్ధిగా జలగం వెంకట్రావు గెలుపొందాడు. మిగిలిన చోట్ల మాత్రం పార్టీకి డిపాజిట్ లకు దరిదాపుల్లోకి రాలేదు. అటు టిడిపి, ఇటు వైసిపి లకు చెందిన నాయకులూ తుమ్మల నాగేశ్వరరావు, ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పార్టీలో చేరారు. తుమ్మల వెంట టిడిపి, పొంగులేటి వెంట వైసిపి చేరడంతో జిల్లాలో ‘గులాబీ రేకులు’ విస్తరించాయి. పార్టీ బలపడింది. పార్టీ బయటకుచూడడానికి బలపడింది కానీ, అది ‘కలకూర గంప’ మాదిరిగా ఉంది. టి డిపి నుంచి తుమ్మల నాగేశ్వర రావు, కాంగ్రెస్ నుంచి కోరం కనకయ్య, వైసిపి నుంచి ఎంపి పొంగులేటి, ఎంఎల్ ఎ లు మదన్ లాల్, తాటివెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు చేరారు. వారి వెంట క్యాడర్ కూడ వచ్చి చేరింది. అయితే ఇలా చేరిన పార్టీ నాయకుల్లో సఖ్యత లేదు. సమన్వయము లేదు. గత ఎన్నికల్లో ఎంపి పొంగులేటి, వైరా ఎంఎల్ఎ మదన్ లాల్, అశ్వరావు పేట ఎంఎల్ఎ తాటి వెంకటేశ్వర్లు, పినపాక ఎంఎల్ఎ పాయం వెంకటేశ్వర్లు ఆ పార్టీ నుంచి గెలుపొందారు. ముగ్గురు ఎంఎల్ ఎ లు వైసిపి పొంగులేటి వెంట ఉన్నప్పటికి, ఆ తరువాత మాత్రం తాటి, పాయం లు టి డిపి నేత తుమ్మల వెంట టి ఆర్ ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. పాయం వెంకటేశ్వర్లు ఎంపి తో కలిసి టిఆర్ఎ స్ లో చేరారు. కానీ వైరా ఎంఎల్ఎ మదన్ లాల్ తో పొంగులేటికి పొసగడం లేదు. దీంతో వైరా ఆనియోజకవర్గంలో ‘నువ్వా- నేనా’ అన్నట్లుగా ఉంది. కనీసం ఒక్క కార్యక్రమంలో కూడ ఇద్దరు కలసి పని చేయడం లేదు. కొద్ది రోజుల క్రితం మంత్రి తుమ్మలనాగేశ్వర రావు పాలేరు నియోజకవర్గ కార్యకర్తల శిక్షణ కార్యక్రమాన్ని భద్రాచలంలో నిర్వహించారు. రెండు రోజుల పాటు ఈ శిక్షణ జరిగింది. అయితే దీనికి టి ఆర్ఎస్ నేతలు రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ముఖ్యమంత్రి ఓ.ఎస్.డి దేశిపతి శ్రీనివాస్ తో సహా పలువురిని పిలిపించారు. అదే నియోజకవర్గంలో భాగంగా ఉన్న ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని మాత్రం ఆహ్వానించలేదు. తనను ఎందుకు ఆహ్వానించలేదంటూ ఎంపి పొంగులేటి టి ఆర్ ఎస్ జిల్లా ఇన్ చార్జి రవీందర్ రావుకు ఫి ర్యాదు చేశారు. కానీ అధిష్టానం నుంచి స్పందన కనిపించడం లేదు. భద్రాచలం శిక్షణ శిబిరాల తర్వాత పది రోజులకు వైరా నియోజకవర్గ ఎంఎల్ఎ కార్యాలయాన్ని మంత్రి తుమ్మలనాగేశ్వర రావు ప్రారంబించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలోని కొందరు ఎంఎల్ఎ లను ఆహ్వానించారు. ఎంపి వర్గీయులను మినహాయిస్తే మిగిలిన వారికి ఎంఎల్ఎ మదన్ లాల్ ఆహ్వానం పలికారు. మంత్రి ప్రారంబించిన ఎంఎల్ఎ క్వార్టర్ కార్యక్రమంలో ఎంపికి ఆహ్వానం అందక పోవడంతో ఆయన హాజరు కాలేదు. చివరకు ఈసందర్బంగా నగరాన్ని ప్లెక్సిలతో నింపేసినప్పటికి, వేదిక మీద తో ఎక్కడ కూడ ఎంపి పోటోను పెట్టలేదు. దీంతో ఈ కార్యక్రమానికి ఎంపి తో సహా ఎంపి వర్గీయులు కూడ ఎవ్వరు హాజరు కాలేదు. వైరా లో వర్గ పోరుకు ఈ కార్యక్రమం అడ్డం పట్టింది. ఖమ్మం ఎంఎల్ ఎ పువ్వాడ అజయ్, కొత్తగూడెం ఎంఎల్ఎ జలగం వెంకట్రావులు హాజరు అయ్యారు.ఎంపి అత్యంత అనుంగు అనుచరుడుగా ఉన్న పినపాక ఎంఎల్ ఎ పాయం ను మదన్ లాల్ ఆహ్వానించలేదు. అదే విదంగా ఖమ్మం పార్లమెంటు పరిదిలోని అశ్వరావు పేట ఎంఎల్ఎ తాటి వెంకటేశ్వర్లు కు కూడ ఆహ్వానం అందలేదు. వీరిద్దరు ఎంపి పొంగులేటి శిబిరంలో ఉంటున్నారు. ఎంపి వర్గానికి చెందిన వారిని వైరా శాసన సభ్యుడు మదన్ లాల్ ఆహ్వానించలేదు. ఆహ్వానం ఎంపికి పంపకపోవడంపై ప్రశ్నిస్తే ‘ఎంపి పొంగులేటి గురించి నన్ను అడగవద్దు’ అని ఎంఎల్ ఎ మదన్ లాల్ అంటున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరులుగా ముద్ర పడ్డ ఎంఎల్ సి బాలసాని లక్ష్మీనారాయణకు, సీడ్ కార్పోరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వర రావులను ఎంపి పొంగులేటి తన ఇంటికి పిలిపించి ఆగ్రహంవ్యక్తంచేశారు. జిల్లాలో టి ఆర్ ఎస్ ల వర్గ పోరు మాత్రంమూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరిస్తుండడం తాజా పరిణామం.