టీ-ఎంసెట్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో నారాయణ శ్రీచైతన్య కాలేజ్ గుట్టురట్టు. శ్రీచైతన్య కళాశాల డీన్‌ వాసుబాబు అరెస్ట్.

హైదరాబాద్:
టీ-ఎంసెట్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో నారాయణ శ్రీచైతన్య కాలేజ్ గుట్టురట్టయింది. శ్రీచైతన్య కళాశాల డీన్‌ వాసుబాబు అరెస్ట్ చేశారు. ఆయనతోపాటు నారాయణ, శ్రీచైతన్య కళాశాలకు ఏజెంట్‌ కమ్మ వెంకటశివనారాయణని కూడా అదుపులోకి తీసుకున్నారు. పేపర్‌ లీకేజీ కేసు ప్రధాన నిందితుడితో వాసుబాబు, శివనారాయణ నిరంతరం టచ్‌లో ఉన్నారని తేల్చిన సీఐడీ అధికారులు. లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితుడిని 2016లో వాసుబాబు కలిశారని పోలీసులు గుర్తించిన సీఐడీ అధికారులు. ఒక్కో విద్యార్థి నుంచి వాసుబాబు రూ.35 లక్షలు వసూలు చేసి ప్రశ్నపత్రాలు అందజేసినట్టు ఆరోపణలున్నాయి. కాల్ లిస్ట్ ఆధారంగా నిందితులను గుర్తించిన సీఐడీ అధికారులు.
ఆరుగురు విద్యార్థులకు ముందస్తుగా పేపర్లు అందించిన వాసు బాబు. ఆరుగురిలో ముగ్గురికి టాప్ ర్యాంకులు కైవసం.ప్రధాన నిందితులు ధనుంజయ ఠాకూర్, సందీప్ కుమార్ లతో శ్రీచైతన్య నారాయణ కాలేజ్ సిబ్బందికి సంబంధాలున్నట్లు పోలీసులు చెప్పారు.
6 కాలేజ్ లకు డీన్ గా వ్యవహరిస్తున్న వాసుబాబు.