ట్రంప్ స్పృహలో ఉన్నారా?

న్యూఢిల్లీ:

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఎయిర్ ఫోర్స్ విమానం ఎక్కేటపుడు ఓ టాయిలెట్ పేపర్ ఆయన ఎడమకాలి బుటుకి అంటుకుంది. కారు దిగింది మొదలు విమానం మెట్లు ఎక్కి లోపలికి వెళ్లే దాకా ట్రంప్ అలాగే నడిచారు. మిన్నెపోలిస్-సెయింట్ పాల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ట్రంప్ అలా ఒక్కో అడుగు వేస్తుంటే పేపర్ అలా ఊగుతూ కనిపించి చూపరులకు బోల్డంత వినోదం పంచింది. ఈ ఘటన తాలూకు వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో తెగ వైరల్ గా మారింది. ఇప్పటికే కొన్ని మిలియన్ల మంది ఈ వీడియోని చూసి నవ్వుకొన్నారు. కొందరు అది టాయిలెట్ పేపర్ అంటే కాదు.. అదింకేదోనని కొందరు జోకులు వేస్తున్నారు. ఇంతకీ ఆ పేపర్ ముక్క తన కాలికి అంటుకున్న విషయం ట్రంప్ కి తెలుసా? ఆయన స్పృహలోనే ఉన్నారా? అనే కామెంట్లు కూడా వచ్చాయి. తన కాలికి పేపర్ అతుక్కున్న విషయం ట్రంప్ కి తెలియకపోతే మాత్రం చుట్టూ ఉన్న సిబ్బంది కళ్లు మూసుకుని కూర్చున్నారా అని సెటైర్లు పడుతున్నాయి.