‘డాటా సెంటర్’ గా ‘కమాండ్ కంట్రోల్’- చీఫ్ సెక్రెటరీ జోషీ.

హైదరాబాద్;
రాష్ట్రంలో నిర్మితమవుతున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ అన్ని శాఖలకు ఉపయోగపడేలా స్టేట్ లేవల్ డాటా సెంటర్ గా తీర్చి దిద్దటానికి తగు ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషిఆదేశించారు.హైదరాబాద్బంజారాహిల్స్ లో దాదాపు ఏడు ఎకరాల స్థలంలో పోలీసు కమాండ్ కంట్రోల్ ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గత నెల 25 న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పనులను పరిశీలించారు. మంగళవారం సచివాలయంలో మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్ ఏర్పాటుపై వివిధ శాఖలు అధికారుల తో ఏర్పాటు చేసిన సమావేశంలో సి.యస్ సలహాలు, సూచనలు స్వీకరించారు.ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అజయ్ మిశ్రా, రాజేశ్వర్ తివారీ, తెలంగాణ,ఆంధ్ర సబ్ ఏరియా, జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ శ్రీ ఎన్ శ్రీనివాస రావు, డి.జి.పి. మహేందర్ రెడ్డి, ముఖ్యకార్యదర్శులు అధర్ సిన్హా, రామకృష్ణా రావు, సునీల్ శర్మ, వికాస్ రాజ్, జి.హెచ్.యం.సి. కమీషనర్ జనార్దన్ రెడ్డి , కార్యదర్శి జగదీశ్వర్, మెట్రో రైల్ యం.డి. ఎన్.వి.ఎస్. రెడ్డి, జిల్లా కలెక్టర్లు, రఘునందన్ రావు, యోగితా రాణా, యం.వి.రెడ్డి, పోలీస్ అధికారులు అంజనీ కుమార్ , మహేష్ భగవత్, సజ్జనార్, జితేందర్, గోపి కృష్ణ, పి.సి.సి.ఎఫ్. పి.కె.ఝా ల తో పాటు మిలటరీ, రైల్వే అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ రోజు వారి కార్యకలాపాలతో పాటు, అత్యవసర సమయాలలో అన్ని శాఖల కు ఉపయోగ పడేలా రాష్ట్ర స్థాయి మల్టీ ఏజేన్సీ ఆపరేషన్ సెంటర్ ను తీర్చిదిద్దేందుకు వివిధ శాఖలు తమ సలహాలను ఇచ్చాయని అన్నారు. ఇప్పటికే వివిధ శాఖల వద్ద ఉన్న డాటాను ఇంటి గ్రేట్ చేయవలసి ఉందని, జిల్లాల సమాచారాన్ని కూడా చేర్చవలసి ఉందని, తెలుపుతూ ఇందుకు అవసరమైన సాప్ట్ వేర్, డాటా బేస్ ను అభివృద్ధి చేయాలన్నారు. మున్సిపల్, విద్యుత్, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, రవాణా, జిఏడి, మెట్రోరైల్, ప్లానింగ్ తదితర శాఖలు డాటానువినియోగించుకొనే అవకాశం ఉంటుందన్నారు. పోలీసు శాఖ ద్వారా నగరంలో ఏర్పాటు చేసిన సిసి కెమరా ల ద్వారా కార్ల కండీషన్, పాత్ హోల్స్, నిర్మాణ పనులు డెబ్రిస్పారవేత, చెత్త రవాణా, ట్రాఫిక్ రద్ధీ, నంబర్ ప్లేట్ల రికగ్నైజేషన్, తదితర పనులు, చేపట్టవచ్చన్నారు. ప్రతి శాఖ తమ డాటా సెంటర్ మెయిన్ డాటా సెంటర్ తో అనుసంధానం చేసుకొని, అవసరమైన సమయాలలో వాడుకొనే అవకాశం ఉంటుందన్నారు. డాటా బేస్ రూపకల్పనకు, సెంటర్ ఏర్పాటుకు ముఖ్యమైన శాఖలతో సాంకేతిక నిపుణులు సంప్రదించి సలహాలు స్వీకరిస్తారని తెలిపారు. వివిధ శాఖల నుండి వచ్చిన డాటాను విశ్లేషణ చేసి క్షేత్ర స్ధాయిలలో పనిచేసి సిబ్బంది ఉపయోగించుకోవాలన్నారు. ముఖ్యమైన కార్యక్రమాల నిర్వహణ సందర్భంగా వివిధ శాఖలలో సమన్వయం చేసుకోవచ్చన్నారు. వివిధ ప్రభుత్వ ఆస్తుల మ్యాపింగ్, జియోట్యాగింగ్, వాతావరణ సమాచారం,ప్రాజెక్టులలో నీటి నిల్వ, పంటల పరిస్ధితి, విద్యుత్ అంతరాయం, వాహనాల ప్రమాదాలు చోటుచేసుకునే ప్రాంతాలు, అటవీ పరిస్ధితి, తదితర పనులన్నీ తక్కువ ఖర్చుతో ఈ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ తో తెలుసుకోవచ్చన్నారు.