డ్యుటెర్టెపై మండిపడుతున్న కేథలిక్ చర్చి.

ఫిలిప్పీన్స్:
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె మరో వివాదానికి నిప్పు రాజేశారు. ఇటీవల డ్యుటెర్టె ఒక సందర్భంలో దేవుడు మూర్ఖుడని వ్యాఖ్యానించడంపై పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కేథలిక్ ప్రాబల్యం ఎక్కువగా ఉండే దేశానికి అధ్యక్షుడిగా ఉండి కూడా డ్యుటెర్టె మతవిశ్వాసాల విషయంలో తన నోటిని అదుపులో ఉంచుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డ్యుటెర్టె బైబిల్ కథ ఆడమ్ అండ్ ఈవ్ గురించి చెబుతూ దేవుడు వారిద్దరినే ఎందుకు సృష్టించాడని.. వారిని ఎందుకు ప్రలోభానికి గురి చేశాడని ప్రశ్నించారు. రెండు వేల ఏళ్లుగా ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతున్న క్రిస్టియన్ వేదాంతులను, విసుగు తెప్పించే ప్రశ్నోత్తర గ్రంథాన్ని అవహేళన చేస్తూ డ్యుటెర్టె దేవుడు అనే ఈ మూర్ఖుడు ఎవరు? అని నిలదీశారు. నువ్వు చాలా చక్కగా తయారు చేశావు.. ఆ తర్వాత నువ్వే దానిని, దాని నాణ్యతను నాశనం చేయడానికి పూనుకుంటావని ఒరిజినల్ సిన్ ను ఉటంకిస్తూ విమర్శించారు