ఢిల్లీ చేరుకున్న మాజీ సి.ఎం.కిరణ్. రేపు కాంగ్రెస్ లో చేరిక.

న్యూ ఢిల్లీ:
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు. కాగా, ఈ నెల 13న రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరతారని ఇటీవల ఆ పార్టీ శ్రేణులు స్పష్టతనిచ్చాయి. కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు ఏపీ నేతలు కాంగ్రెస్ లో చేరతారని వార్తలు వస్తున్నాయి. రేపు కాంగ్రెస్ అధ్యక్షుడితో చర్చించిన తరువాత ఆ పార్టీలో చేరనున్న విషయాన్ని స్వయంగా కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించనున్నారు. రేపటి ఈ సమావేశానికి ఏపీసీసీ వ్యవహారాల ఇంఛార్జ్ ఊమెన్ చాందీ, అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా హాజరుకానున్నారు.