తనిఖీలు తూతూమంత్రం. టాకీసులలో రేట్లు యధాతథం.

హైదరాబాద్:
హైదరాబాద్ పరిధిలోని మల్టీప్లెక్స్, థియేటర్లలో తూనికలు కొలతల శాఖ దాడులు నామమాత్రంగా సాగుతున్నవి.మల్టీ ప్లెక్స్ యాజమాన్యాలు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నవి.నామమాత్రంగా ప్రత్యేక తనిఖీలు చేస్తున్న లీగల్ మెట్రాలజీ అధికారులు.
కొన్ని థియేటర్లలోకి అధికారులను సైతం అనుమతించని యాజమాన్యం.చోద్యం చూస్తున్న అధికారులు, పలు మాల్స్ లో మీడియా పై దౌర్జన్యం చేసిన థియేటర్ సిబ్బంది.పర్మిషన్ లేదని దాబాయింపు. కొన్ని థియేటర్లలలో దాడులు చేయకుండా చర్చలు చేస్తున్న అధికారులు.మీడియా లేకుండా, శాఖకు చెందిన ఇన్స్పెక్టర్ లు లేకుండా తూతూ మంత్రంగా కొనసాగుతున్న లీగల్ మెట్రాలజీ తనిఖీలు.
నిబంధనలు ఉల్లంఘనపై 54 కేసులు నమోదు చేసినట్టు తూనికలు, కొలతల శాఖ అధికారులు గురువారం ప్రకటించారు.థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో తినుబండారాలు అధిక ధరల విక్రయాల నిరోధానికి ఇటీవల జారీచేసిన ఉత్తర్వుల అమలు ఉల్లంఘనపై తూనికల కొలతల శాఖ స్పందించింది. ఈ ఉత్తర్వులను అమలు చేయకుండా వినియోగదారుల నుండి యధావిధిగా ఎంఆర్‌పీ కంటే అధిక ధరలు వసూలు చేస్తున్న పలు మల్టీప్లెక్స్‌లపై కేసులు నమోదు చేసింది. తూనికల కొలతల శాఖ ప్యాకేజ్డ్‌ కమొడిటీస్‌ చట్టం అమలుకు సంబంధించి తూనికల కొలతల శాఖ గత నెలలో ఉత్తర్వులు జారీచేసి, ఆగస్ట్‌ 1వ తేదీ నుండి కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది.
ఈ నిబంధనలపై ఆయా థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించి అవగాహన సైతం కల్పించింది. తూనికల కొలతల శాఖ ఉత్తర్వుల అమలుపై ఈ నెల 2, 3వ తేదీలలో గ్రేటర్‌ హైదరాబాద్‌, ఎచ్‌ఎండిఏ పరిధిలోని థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఇందుకోసం అసిస్టెంట్‌ కంట్రోలర్‌ భాస్కర్‌రెడ్డి, జగన్మోహన్‌ రెడ్డి, విజయసారథి, నిర్మల్‌ కుమార్‌, రాజేశ్వర్‌, శివానంద్‌ ఆధ్వర్యంలో దాదాపు 30 మంది అధికారులతో 7 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గురువారం నాడు ఈ ప్రత్యేక బృందాలు 20 మల్టీప్లెక్స్‌లలో తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించకుండా వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్న 18 మల్టీప్లెక్స్‌లలో 54 కేసులు నమోదు చేశాయి.
ఐమాక్స్‌, పీవీఆర్‌ గెలీలియో, పీవీఆర్‌ ఐకాన్‌ మాధాపూర్‌, జీవీకే వన్‌ బంజారాహిల్స్‌, బిగ్‌ సినిమా కాచీగూడ, మహాలక్ష్మి కొత్తపేట, బీబీకే మల్టీప్లెక్స్‌ ఎల్‌బీనగర్‌, ఏషియన్‌ సినీమా స్క్వైర్‌ ఉప్పల్‌, ఏషియన్‌ రాధిక ఈసీఐఎల్‌, సినీపోలీస్‌ మల్కాజగిరి, తాళ్లూరి ఈసీఐఎల్‌,స్పెషల్‌ సినిమా ప్రై.లి. మల్లాపూర్‌, ఏషియన్‌ ముకుంద మేడ్చల్‌,
ఏషియన్‌ సినీ ప్లాంట్‌ కొంపెల్లి, సుజనా ఫోరం మాల్‌ కూకట్‌పల్లి, మంజీరా మాల్‌ జెఎన్‌టియు,
సినీపోలీస్‌, శంషాబాద్‌, ఏషియన్‌ సినిమా టౌన్‌, మియాపూర్‌ మల్టీప్లెక్స్‌లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

– టోల్‌ ఫ్రీ నంబర్‌ 180042500333, వాట్సప్‌ నంబర్‌ 7330774444పై వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చు.