తాటిపూడి రిజర్వాయర్ పరిశీలన. – పవన్ పోరాటయాత్ర.

ఎస్.కోట:
ఎస్.కోట నియోజకవర్గంలో పోరాట యాత్రలో భాగంగా జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తాటిపూడి రిజర్వాయర్ ను పరీశీలించారు. అక్కడి జలాశయం, ఆ జలాలు కలుషితమయ్యే పరిస్థితులపై చర్చించారు. కొద్ది రోజుల క్రితం అరకు మన్యంలో పర్యటించినప్పుడు గాలికొండ దగ్గర బాక్సైట్ తవ్వకాలు అడ్డగోలుగా చేస్తున్న తీరుని పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఈ ప్రాంతమే తాటిపూడికి క్యాచ్మెంట్ ఏరియా. గాలికొండ లో తవ్వకాలతో తాటిపూడి జలాశయంలోకి కలుషిత జలాలు చేరుతాయని నిపుణులు పవన్ కల్యాణ్ దృష్టికి తెచ్చారు. ఈ క్రమంలో తాటిపూడి రిజర్వాయర్ ను సందర్శించారు.