తిరుమలకు పూర్తిస్థాయి భద్రత -ఏపీ డీజీపీ.

తిరుపతి:
తిరుమలకు పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. మంగళవారం తిరుమల శ్రీవారిని డీజీపీ ఠాకూర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు భద్రతపై టీటీడీ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామన్నారు. తిరుమలలో ట్రాఫిక్‌ సిబ్బంది, హోంగార్డులను నియమిస్తామని డీజీపీ చెప్పారు. టీడీపీ సీవీఎస్‌వో పోస్టును నెలరోజుల్లో భర్తీ చేస్తామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కొనసాగిస్తామని, టెక్నాలజీ ఉపయోగించుకుంటామని డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పష్టం చేశారు.