తెలంగాణకు ఛత్తీస్ గఢ్ ‘కరెంట్ షాక్’!!

ఎస్.కె.జకీర్.
తెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు కరెంట్ షాక్ తగిలే వార్తను ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఎస్ఈఆర్‌సీ) వినిపించింది. వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే మార్వా ప్లాంట్ల నిర్మాణవ్యయాన్ని రూ.8,892.51 కోట్లుగా నిర్ణయించింది. అంటే సగటున మెగావాట్‌కు వ్యయం రూ.8.89 కోట్లు. అంటే యూనిట్ కు రూ.4 కంటే ఎక్కువ వసూలు చేయనుంది. డిస్కంలు ఈ మొత్తానికి కొంటే మరి వినియోగదారులపై ఏ మేరకు విద్యుత్ ఛార్జీలు బాదుతారో అనే ఆందోళన వ్యక్తమవడం సహజం. వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు సెప్టెంబర్ 2015లో తెలంగాణ ‘డిస్కం’లు సీ.ఎస్.ఈ.ఆర్‌.సీతో 12 ఏళ్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) కుదుర్చుకొన్నాయి. అప్పటికింకా మార్వా ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉన్నందువల్ల పీ.పీ.ఏలో విద్యుత్ సరఫరా ధరను ఛత్తీస్‌గఢ్‌ ఈ.ఆర్సీ భవిష్యత్తులో నిర్ణయించేందుకు అంగీకారం కుదిరింది. 2008లో నిర్మాణం ప్రారంభమై 2016లో పూర్తయిన ఈ ప్లాంట్ల వ్యయం భారీగా పెరిగింది. దీంతో ఇప్పుడు తెలంగాణకు అమ్మే విద్యుత్‌ ధరను మెగా వాట్ కు సుమారుగా రూ.8.9 కోట్లుగా ఖరారు చేస్తూ సీఎస్ఈఆర్సీ ఉత్తర్వులు జారీచేసింది. మార్వా ప్లాంట్ల నిర్మాణవ్యయ సొమ్మును స్థిరఛార్జీ రూపంలో తెలంగాణ డిస్కంలు ఏటా కొంత ఛత్తీస్‌గఢ్‌కు చెల్లించాలి. 2018-19లో రూ.1,606.08 కోట్లు స్థిరఛార్జీగా చెల్లించాలి. ఇది కాకుండా రోజూ కొనుగోలు చేసే ప్రతి యూనిట్‌కు బొగ్గు, ఇతర ఇంధనాల ధరల ఆధారంగా అదనంగా వేరియబుల్‌ కాస్ట్ కింద మరో రూ.1.39 కట్టాలి. నిర్మాణ వ్యయం పెరిగినందువల్ల ఆ మొత్తాన్ని తెలంగాణ నుంచే వసూలు చేయాలని సీఎస్ఈఆర్సీ నిర్ణయించింది. ఖర్చు తగ్గించాలని తెలంగాణ డిస్కంలు వాదించాయి. తెలంగాణ అభ్యంతరాలను పక్కకునెట్టి సీఎస్ఈర్సీ జూలై 7న మార్వా ప్లాంట్ల నిర్మాణవ్యయాన్ని రూ.8,892.51 కోట్లుగా నిర్ణయించింది. మార్వా ప్రాజెక్ట్ వ్యయంతో పోలిస్తే 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఏడో యూనిట్ వ్యయం చాలా తక్కువ. భూమి సిద్ధంగా ఉండటంతో ఆ యూనిట్ ను రూ.5,700 కోట్లతో నిర్మించారు. అంటే మెగా వాట్ కు రూ.6 కోట్ల కంటే తక్కువ ఖర్చయింది. దేశంలో నిర్మాణంలో ఉన్న కొత్త విద్యుత్కేంద్రాల నిర్మాణ వ్యయం సగటున రూ.7 కోట్లు మాత్రమే ఉంటోంది. అంటే సీఎస్ఈర్సీ తెలంగాణ డిస్కంల నుంచి దాదాపుగా మెగావాట్ కి రూ. 1-3 కోట్లు అదనంగా వసూలు చేయనుంది. ఇంత భారీ ఛార్జీలు చెల్లించడం తెలంగాణ డిస్కంలకు పెనుభారంగా మారనుంది. రాబోయే మూడేళ్లకు అంటే జూలై 2018-19 నుంచి మార్చి 2020-21 వరకు స్థిర, చలన ఛార్జీలను ఖర్చులను ఛత్తీస్ గఢ్ ఈర్సీ ఖరారు చేసింది. వెయ్యి మెగావాట్ల ప్లాంట్లలో రోజూ కనిష్ఠంగా 76.50 శాతం(765 మెగావాట్ల)కు తగ్గకుండా విద్యుదుత్పత్తి చేయాలని ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ‘మార్వా’ ప్లాంట్లను ఆదేశించింది.

 

‘ది హిందూ’ సౌజన్యంతో…..

TELANGANA
Chhattisgarh power unit set to burden consumers
B. Chandrashekhar
HYDERABAD, JULY 10, 2018 00:00 IST
High project cost, at nearly Rs. 8.9 crore per mega watt, is expected to prove a costly affair
Consumers of energy in the State are likely to be burdened further for utilising power generated at Marwa Thermal Power Project (MTPP) of Chhattisgarh as the Electricity Regulatory Commission there has approved the project at Rs. 8,892.5 crore, in spite of objections raised by Telangana.
The high project cost, which turns out to be nearly Rs. 8.9 crore per mega watt, is expected to prove a costly affair to consumers of Telangana as its two power distribution companies entered into a long-term power purchase agreement with the Chhattisgarh State Power Generation Company in September 2015 for supply of 1,000 mw power for 12 years. The PPA did not specify the tariff since the 2×500 mw Marwa project was still under implementation then.
It was agreed then that the cost of supply would be determined by Chhattisgarh ERC later. The two units of the project commenced commercial generation in March and July 2016, respectively. The two power distribution companies of Telangana have impleaded in the hearing related to finalising the project cost and argued for reduction of the cost. The Chhattisgarh ERC, after a long hearing schedule, gave its order on July 7, overlooking the objections of Telangana discoms.
In comparison to the project cost of Marwa, the 800 mw seventh unit of the Kothagudem Thermal Power Station in the State has been established with Rs. 5,700 crore and the per mega watt cost is less than Rs. 6 crore although the project cost does not include land cost since land was already available.
It is understood that inordinate delay in completion of the project and high component of interest during the construction have pushed up the project cost ultimately. Although the Chhattisgarh ERC did not specify the cost of supply, it is expected to be more than Rs. 4 per unit since the project cost is very high. The Chhattisgarh ERC has fixed the costs for three years from July 2018-19 to March 2020-21, during which period generation is projected at 6,349.6 million units, 6,367 MU and 6,350 MU, respectively at the plant load factor of 76.5%. Attempts to get response of the discoms proved futile.
________________________________________
Project turns dearer
• Inordinate delay in completion of the project and high component of interest during the construction have pushed up the project cost ultimately
• Although the Chhattisgarh ERC did not specify the cost of supply, it is expected to be more than Rs. 4 per unit