తెలంగాణలో కాంగ్రెస్ విజయం పక్కా. – జైపాల్ రెడ్డి.

హైదరాబాద్:
దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని కాంగ్రెసు సీనియర్ నాయకుడు ఎస్.జైపాల్ రెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ UPA అలయన్స్ తో అధికారం లోకి వస్తుందని ఆయన తెలిపారు.
గ్రామ స్థాయి నుండి కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందన్నారు. గ్రామాలలో టీఆరెస్ పై వ్యతిరేకత ఉందని ఆయన తెలిపారు. ఆంద్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాదన్నారు.కల్యాణ లక్ష్మీ అందరికీ అందటం లేదన్నారు. తన డ్రైవర్ కూతురు పెళ్లి అయ్యి 3 సంవత్సరాలు అయింది ఇంతవరకు కళ్యాణ లక్ష్మి రాలేదని జైపాల్ రెడ్డి తెలిపారు.