తెలంగాణలో భారీ వర్ష సూచన.

హైదరాబాద్:
ఛత్తీస్ గఢ్ దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం 7.6 km ఎత్తు వరకు కొనసాగుతోంది. తెలంగాణలో ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.
ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలతో పాటు తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు. తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం చాలాచోట్ల
కురిసే అవకాశం ఉంది. తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది
కోస్తా ఆంధ్రలో ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలతో పాటు తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు. కోస్తా ఆంధ్రలో ఈరోజు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు కోస్తా ఆంధ్రలో రేపు, ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.రాయలసీమలో తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు రాగల మూడు రోజులు రాయలసీమలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.