థాయ్ గుహ ‘రెస్క్యూ ఆపరేషన్’ లో ప్రాణం విడిచిన మహనీయుడు.

బ్యాంకాక్:
తన ప్రాణాలు లెక్ఖ చేయకుండా థాయ్ లాండ్ గుహ నుంచి పిల్లల్ని రక్షించిన త్యాగం విలువ కట్టలేనిది. ఆ గొప్ప వ్యక్తి సమాన్ కునూన్ థాయ్ లాండ్ కు చెందిన మాజీ నేవీ అధికారి. రెస్క్యూ ఆపరేషన్ లో తన ప్రాణాలు కోల్పోయిన కునూన్ పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.థాయిలాండ్ లోని ఓ గుహ లోపల చిన్న పిల్లలు ఇరుక్కు పోయారు. వారిని రక్షించటానికి ప్రపంచం మొత్తం ఆత్రుత గా ఎదురుచూస్తున్నారు. ఈ రెస్క్యూ గ్రూపులోనే ఈయన స్వచ్ఛందంగా పిల్లల ను కాపాడటం కోసం పాల్గొన్నారు. ఈ పిల్లల కు ఆక్సిజన్, ఆహారం ఇవ్వడం కోసం లోపలకు వెళ్లిన ఈ మాజీ నేవీ ఆఫీసర్ తిరిగి వచ్చే ప్రయత్నం లో తన సిలిండరు లో ఆక్సిజన్ అయిపోయి ఊపిరి ఆడక మరణించడం విషాదం. పిల్లలకు సేవా దృక్పథం తో సహాయం చేయబోయి తన జీవితాన్ని పణంగా పెట్టిన మహనీయుడికి సెల్యూట్ చేయాల్సిందే. అతని చివరి ఫోటో ఇది.