దంపతుల దారుణ హత్య.

వరంగల్:
జిల్లాలోని హసన్‌పర్తిలో ఇద్దరు వృద్ద దంపతుల దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని దుండగులు దంపతులను గొంతుకోసి హత్య చేశారు. మృతులు దామోదర్, పద్మలుగా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులకు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నాడు. ఘటనా స్థలానికి సీపీ రవీందర్ చేరుకుని కేసు విచారిస్తున్నారు.