దేశంలో ఉత్తమ పోలీసు స్టేషన్ గా నారాయణపూర్!!

hyderabad:

2018కి గాను ఈ ఏడాది ఉత్తమ పోలీస్‌స్టేషన్ల జాబితాలో తెలంగాణకు చోటు దక్కింది. ఈ జాబితాను బుధవారం నాడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాజస్థాన్‌‌లోని బికనూర్‌ పోలీస్‌స్టేషన్‌కు ఉత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాలో మొదటి స్థానం లభించింది.కాగా రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో నారాయణపూర్ పోలీస్ స్టేషన్‌కు 14వ స్థానం లభించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్‌కు 20వ స్థానం లభించింది.