దేశాభివృద్ధికి రాష్ట్రాలే కీలకం. వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

న్యూడిల్లీ;
దేశాభివృద్ధికి రాష్ట్రాల అభివృద్దే కీలకమని తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. వ్యవసాయరంగానికి కేంద్రప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. ఆదివారంన్యూ డిల్లీ లో ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన నీతిఆయోగ్ సమావేశంలో కెసిఆర్ పలు సూచనలు చేశారు.రైతుల ఆదాయం రెట్టింపు చేసే చర్యలలో భాగంగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధీ హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు పన్ను రాయితీలు ఇవ్వాలని కోరారు. తెలంగాణలో తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను, సాగునీటిప్రాజేక్టులను కెసిఆర్ ప్రస్తావించారు. రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ‘రైతుబందు’ పధకం, ఎకరానికి పంట పెట్టుబడి సహాయం కింద ఎకరానికి నాలుగు వేల రూపాయలు అందజేసిన తీరును నీతిఆయోగ్ సమావేశంలో సి.ఎం.వివరించారు. తెలంగాణలో98 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని వారికి మేలు కలిగే విధంగా రైతుభీమా పధకాన్ని ప్రవేశపెడుతున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ఈ పథకం ద్వారా 18 నుంచి 60 ఏళ్ల వయస్సు ఉన్న రైతులందరికీఎల్‌ఐసీ బీమా అందజేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రైతు మరణిస్తే తక్షణమే 5 లక్షల రూపాయలు బాధిత కుటుంబానికి బీమా అందనుందనిచెప్పారు. ఇందుకోసంరైతులకు దాదాపు రూ.1000 కోట్ల ప్రీమియంఎల్.ఐ.సి.కి చెల్లిస్తున్నట్టు కెసిఆర్ తెలియజేశారు.50 లక్షల మంది రైతులకు రైతుభీమా వల్ల లబ్ది చేకూరుతుందన్నారు. డైరీలు, కోళ్ల పరిశ్రమ, మత్సపరిశ్రమ, గొర్రెల, మేకల పంపకాల్లో ఆదాయపు పన్ను నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. నీటి పారుదల రంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్నట్టుచెప్పారు. రూ.1050 కోట్లతో మూడు ఏళ్లలో 356 వ్యవసాయ గోదాములు నిర్మించామని తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్రాన్ని కోరారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే అదనంగా 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలోని 24 జిల్లాల్లో 18 లక్షల ఎకరాల స్థిరీకరణ జరగనుంది. మెగా ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అత్యాధునిక పద్ధతులను ఉపయోగిస్తున్నాం. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా గత మూడేళ్లలో రూ.1,050 కోట్ల వ్యయంతో 18.30 మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల356 గోడౌన్లు నిర్మించాం. రాష్ర్టాల అభివృద్ధిపైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాలకు ఎక్కువ నిధులు ఇవ్వలేని పక్షంలో పన్ను రాయితీలు కల్పించాలి. వ్యవసాయంతో పాటు అనుబంద రంగాలైన డెయిరీ, పౌల్ట్రీ, మేకలు, గొర్రెల పెంపకం, చేపల పెంపకంపై దృష్టి కేంద్రీకరించాలి. ఆయా రంగాలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. విదేశీ వ్యవహారాలు, రక్షణ, ఆర్థిక, అంతర్జాతీయ అంశాలపై కేంద్రం మరింత దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందన్నారు. విద్య, వైద్యం, నగరీకరణ, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి తదితర అంశాల్లో రాష్ర్టాలకు మరింత స్వేచ్ఛనివ్వాలని సీఎం కేసీఆర్ కేంద్రప్రభుత్వానికిసూచించారు.నీతిఆయోగ్పాలకమండలి చైర్మన్‌ ప్రధాని సహా మండలి సభ్యులైన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, కేంద్ర మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.